ప్రభాస్ కొత్త సినిమా టైటిల్ అదేనా?

ప్రభాస్ కొత్త సినిమా టైటిల్ అదేనా?

‘బాహుబలి’ సినిమాకు ఐదేళ్ల పాటు అంకితం అయిపోయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు ‘సాహో’తో పాటు రాధాకృష్ణ కుమార్ తో చేస్తున్న సినిమా మీద ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ‘సాహో’ చిత్రీకరణ ఏడాది కిందట్నుంచే కొనసాగుతుండగా.. ఇటీవలే రాధాకృష్ణ సినిమాను కూడా మొదలుపెట్టాడు. ఈ రెండు సినిమాలూ ఒకేసారి యూరప్‌లో షూటింగ్ జరుపుకుంటుండటం విశేషం.

ప్రభాస్-రాధాకృష్ణ సినిమా కోసం ఇటీవలే ఇటలీలో కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. ఐతే ఈ సినిమా ఆరంభ దశలో ఉండగానే టైటిల్ గురించి ఆసక్తికర ప్రచారాలు నడుస్తున్నాయి. ఇటీవలే ఈ చిత్రానికి ‘అమూర్’ అనే టైటిల్ ఖరారైనట్లు వార్తలొచ్చాయి. అమూర్ అంటే ఫ్రెంచ్ భాషలో ప్రేమ అని.. ఇది లవ్ స్టోరీ కాబట్టి ఆ టైటల్ పెట్టారని అన్నారు.

ఐతే ఇప్పుడు ఈ చిత్రానికి మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ‘జాన్’ అనే పేరును సినిమాకు ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ఇదైతే అందరికీ క్యాచీగా ఉంటుందని.. మూడు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇదే కరెక్ట్ టైటిల్ అని ఫిక్సయ్యారని అంటున్నారు. మామూలుగానే ప్రభాస్‌కు మంచి మాస్ ఇమేజ్ ఉండగా.. ‘బాహుబలి’తో అది మరెన్నో రెట్లు పెరిగింది. ‘సాహో’ కూడా పూర్తి స్థాయి యాక్షన్ సినిమా.

ఐతే వీటన్నింటికీ భిన్నంగా.. తన ఇమేజ్‌ నుంచి దూరంగా జరిగి పూర్తి స్థాయి ప్రేమకథ చేస్తున్నాడట ప్రభాస్ రాధాకృష్ణతో. ఇది పునర్జన్మల నేపథ్యంలో సాగుతుందని కూడా అంటున్నారు. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ‘సాహో’ను నిర్మిస్తున్న యువి క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్-విక్కీలే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English