ప్రీతి జింటా అతడితో సెటిల్ చేసుకుందా?

ప్రీతి జింటా అతడితో సెటిల్ చేసుకుందా?

తెలుగులో ‘రాజకుమారుడు’..‘ప్రేమంటే ఇదేరా’ లాంటి హిట్ సినిమాల్లో నటించిన బాలీవుడ్ భామ ప్రీతి జింతా.. సినిమాల్లో మంచి కెరీర్ ఉండగానే ఐపీఎల్ ఫ్రాంఛైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌లో వాటా తీసుకుని బిజినెస్ ఉమన్‌గా మారింది. ఆ ఫ్రాంఛైజీ సహ యజమాని నెస్ వాడియాతో కొంత కాలం ఆమె గాఢమైన ప్రేమలో మునిగి తేలింది. ఒక దశలో ఈ వ్యాపార భాగస్వాములు పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలొచ్చాయి. కానీ ఏమైందో ఏమో ఇద్దరూ విడిపోయారు. ఈ క్రమంలోనే ఇద్దరికీ పెద్ద గొడవ కూడా జరిగింది. నెస్ వాడియా.. ఒక ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ప్రీతిని బూతులు తిట్టడం, ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరగడంతో ప్రీతి అతడిపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఒక దశలో ఈ కేసు వాడియాను గట్టిగానే తగులుకుంది.

ఐతే ప్రీతి 2014లో పెట్టిన ఈ కేసును ఇప్పుడు బొంబాయి హైకోర్టు కొట్టేసింది. ప్రీతిని వాడియా లైంగికంగా వేధించాడనడానికి సరైన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. ఐతే ఒక టైంలో బలంగా ఉన్న ఈ కేసును నీరుగారిపోయేలా చేసింది ప్రీతినే అంటోంది ముంబయి మీడియా. ఈ గొడవ.. కేసు తర్వాత కూడా ప్రీతి, వాడియా పంజాబ్ ఫ్రాంఛైజీతోనే కొనసాగుతున్నారు. ఈ కేసు తనకు పెద్ద తలనొప్పిగా మారడంతో కోర్టు బయటే ప్రీతితో సెటిల్ చేసుకున్నాడట వాడియా.

ఈ ఒప్పందం వల్ల ప్రీతికి ఏం ప్రయోజనం చేకూరిందో ఏమో కానీ.. ఆల్రెడీ పెళ్లి కూడా చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిలైన ప్రీతి.. ఈ కేసును సాగదీయడం ఇష్టం లేక వెనక్కి తగ్గిందట. సాక్ష్యాధారాలు సమర్పించకపోవడం ద్వారా కేసు నీరుగారిపోయేలా చేసినట్లు చెబుతున్నారు. మొత్తానికి ఈ మాజీ ప్రేమికుల గొడవకు ఇంతటితో తెరపడినట్లే. మూడేళ్ల కిందట గుడ్ఎనఫ్ అనే విదేశీయుడిని ప్రీతి పెళ్లాడిన సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English