తప్పు చేసినట్లు ఒప్పుకున్న సింగర్

తప్పు చేసినట్లు ఒప్పుకున్న సింగర్

ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా.. ‘మి టు’ చర్చలే నడుస్తున్నాయి. ఒక్కసారిగా ఈ ఉద్యమం ఉద్ధృత రూపం దాలుస్తోంది. సినీ రంగానికి చెందిన అమ్మాయిలు ధైర్యంగా గళం విప్పుతున్నారు. ప్రముఖులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాది ఫేమస్ సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి చేస్తున్న ఆరోపణలు.. ఆమె వెలికి తీస్తున్న బాగోతాలు సంచలనం రేపుతున్నాయి. బెంగళూరుకు చెందిన ఫేమస్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ రఘు దీక్షిత్ మీద చిన్మయి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. రఘు తనను ఒకసారి ఇంటికి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించిన ఆమె.. పేరు వెల్లడించని మరో సింగర్‌ను రఘు లైంగికంగా వేధించిన విషయాన్ని కూడా వెల్లడించింది.

ఐతే ఈ ఆరోపణలపై రఘు వెంటనే స్పందించాడు. చిన్మయి చెబుతున్న బాధితురాలితో తాను ఇబ్బందికర రీతిలో వ్యవహరించిన మాట వాస్తవమే అని అతను చెప్పాడు. ఈ విషయంలో ఆమెకు ఇప్పటికే ఒకసారి వ్యక్తిగతంగా సారీ చెప్పానని.. ఇప్పుడు బహిరంగ క్షమాపణ చెబుతున్నానని తన స్టేట్మెంట్లో పేర్కొన్నాడు. ఒక సాంగ్ రికార్డింగ్ తర్వాత ఆ పాట బాగా వచ్చిందన్న ఆనందంతో ఆమెను కౌగిలించుకున్నానని.. తర్వాత ముద్దు పెట్టబోయానని.. ఆమె నిరాకరించడంతో ఆగిపోయానని అన్నాడు రఘు. అప్పటికి తన భార్యతో తనకు సంబంధాలు తెగిపోయానని.. తానొక చిత్రమైన ఫేజ్‌లో ఉన్నానని.. ఆ క్రమంలోనే ఆమెతో అలా వ్యవహరించానని చెప్పాడు రఘు. ఇప్పుడు తన భార్య తనతో లేదని.. ఈ సందర్భంగా ఆమెకు కూడా తాను సారీ చెబుతున్నానని అన్నాడతను. ఐతే చిన్మయితో అసభ్యంగా ప్రవర్తించడం గురించి మాత్రం రఘు స్పందించలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English