అరవింద సమేత.. జాతకాలు మారుస్తుందా?

అరవింద సమేత.. జాతకాలు మారుస్తుందా?

తెలుగులో చాలా నెలల తర్వాత ఒక భారీ సినిమా విడుదలకు సిద్ధమైంది. జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల ఆసక్తికర కలయికలో తెరకెక్కిన ‘అరవింద సమేత’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా కోసం అభిమానులే కాదు.. సామాన్య ప్రేక్షకులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వేరే సినిమాలు ఎలా ఆడినా.. ఎంత పెద్ద హిట్టయినా.. ఒక పెద్ద స్టార్ హీరో-స్టార్ డైరెక్టర్ కలిసి చేసే భారీ సినిమా వస్తే బాక్సాఫీస్ దగ్గర ఉండే సందడే వేరు. అందులోనూ ఈ ఏడాది ద్వితీయార్ధం మొత్తానికి ఈ స్థాయి భారీ సినిమా ఇదొక్కటే కావడంతో దీనికి హైప్ మామూలుగా రాలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుంది.. ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి.. అంతిమంగా ఫలితం ఎలా ఉంటుంది అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

‘అరవింద సమేత’ చాలామందికి చాలా రకాలుగా కీలకం. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పని చేయాలని ఎన్నో ఏళ్ల పాటు ప్రయత్నించి ఎట్టకేలకు ఆ కోరిక తీర్చుకున్న తారక్.. అతడి కలయికలో పెద్ద హిట్ ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ‘టెంపర్’ నుంచి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ సక్సెస్ ట్రాక్‌లో నడుస్తున్న తారక్.. చివరి సినిమా ‘జై లవకుశ’తో కొంత నిరాశ పరిచాడు. అతను మళ్లీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం కోసం చూస్తున్నాడు. త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్‌తో జత కట్టాడు, పైగా సినిమాకు మంచి హైప్ ఉంది కాబట్టి కాబట్టి మినిమం వంద కోట్ల షేర్ రాబట్టే సినిమా ఇస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రధానంగా వాళ్ల దృష్టి రికార్డుల మీదే ఉంది. మరి ఎన్టీఆర్ స్టామినా ఏంటో చూడాలి.

ఇక ‘అజ్ఞాతవాసి’తో చాలా అవమానం మూటగట్టుకున్న త్రివిక్రమ్ ఈ చిత్రంతో బౌన్స్ బ్యాక్ కావాలని చూస్తున్నాడు. నిర్మాత రాధాకృష్ణ పరిస్థితీ అంతే. ఇక తెలుగులో ఇప్పటిదాకా హిట్టు ముఖమే చూడని హీరోయిన్ పూజా హెగ్డే.. ‘అరవింద సమేత’ తన రాత మారుస్తుందని ఆశిస్తోంది. త్రివిక్రమ్‌తో పని చేయాలన్న కలను ఎట్టకేలకు నెరవేర్చుకున్న తమన్ సైతం ఈ సినిమాపై చాలా ఆశలతో ఉన్నాడు. మరి వీళ్లందరి ఆశల్ని ‘అరవింద సమేత’ ఏమేరకు నెరవేరుస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English