`# మీ టూ` పై ఐష్ కామెంట్స్!

`# మీ టూ` పై ఐష్ కామెంట్స్!

బాలీవుడ్ విల‌క్ష‌ణ నటుడు నానాప‌టేక‌ర్ పై న‌టి త‌నూ శ్రీ ద‌త్తా చేసిన ఆరోప‌ణ‌లు పెను ప్ర‌కంప‌న‌లు రేపుతోన్న సంగ‌తి తెలిసిందే. భార‌త్ లో మొద‌లైన `#మీ టూ` ఉద్య‌మంలో సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ‌నేత‌లు, క్రీడాకారుల‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే త‌నూకు మ‌ద్ద‌తుగా ప‌లువురు బాలీవుడ్ న‌టీన‌టులు నిలిచిన సంగ‌తి తెలిసిందే. అయితే, గ‌తంలో జ‌రిగిన వేధింపుల ఘ‌ట‌నల‌ను ఇపుడు ఎందుకు వెల్ల‌డిస్తున్నారంటూ కొంద‌రు మేధావులు...బాధిత మ‌హిళ‌ల గురించి చుల‌క‌న‌గా మాట్లాడుతున్నారు. తాజాగా, త‌నూకు మ‌ద్ద‌తుగా ఐశ్వర్య రాయ్ ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. లైంగిక వేధింపుల‌కు గురైన వారు ఆ విషయాలను బ‌య‌ట‌పెట్టేందుకు నిర్దిష్ట స‌మ‌యం ఉండ‌ద‌న్నారు.

మ‌హిళ‌ల‌పై వేధింపుల గురించి గ‌తంలో చాలాసార్లు చెప్పాన‌ని...ఇక‌పై కూడా మాట్లాడతాన‌ని ఐష్ అన్నారు. ప్రపంచంలో ఏ మూల ఉన్న మహిళైనా సోషల్‌ మీడియా ద్వారా త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని వెల్ల‌డించ‌వ‌చ్చ‌ని అన్నారు. త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని ఏస‌మ‌యంలో బ‌య‌ట‌పెట్టినా... వారికి మద్దతిచ్చి సాయం చేస్తే చాల‌ని ఐష్ చెప్పారు. ఆలస్యంగానైనా భార‌త్ లో `#మీ టూ` రావడం మంచి ప‌రిణామ‌మ‌న్నారు. గ‌తంలో తాను కూడా స‌ల్మాన్ నుంచి మాన‌సికంగా, శారీర‌కంగా వేధింపులు ఎదుర్కొన్నాన‌ని ఐష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.  బ్రేకప్‌ తర్వాత స‌ల్మాన్ త‌న‌ను ప్రశాంతంగా ఉండనిచ్చేవాడు కాద‌ని ఐష్ చెప్పారు. త‌న గురించి చెత్త వాగుడు వాగేవాడ‌ని, త‌న‌తో ఉన్న‌పుడు శారీరకంగా హింసించేవాడ‌ని చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English