సూపర్‌స్టార్‌పై పగ తీర్చుకుంటోన్న హీరోయిన్‌?

సూపర్‌స్టార్‌పై పగ తీర్చుకుంటోన్న హీరోయిన్‌?

కంగన రనౌత్‌ ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టు చెబుతుందని పేరు. హృతిక్‌ రోషన్‌, కరణ్‌ జోహార్‌లాంటి పెద్ద తలకాయలకే ఎదురు వెళ్లిన కంగన తనతో ఒక దర్శకుడు అసభ్యంగా ప్రవర్తిస్తే మౌనం వహిస్తుందా? క్వీన్‌ చిత్ర దర్శకుడు వికాస్‌ భల్‌ తనని వేధింపులకి గురి చేసాడంటూ 'ఫాంటమ్‌ ఫిలింస్‌'లో పని చేసే ఒక స్త్రీ ఆరోపించడంతో ఆ సంస్థే మూత పడింది. అలాగే ఆ దర్శకుడితో ఒప్పందాలు చేసుకున్న పలు సంస్థలు అవి కాన్సిల్‌ చేసుకున్నాయి.

ఇదే సమయంలో క్వీన్‌లో నటించిన కంగన ఆ దర్శకుడిని మరింత ఇరుకున పెడుతూ తనతోను అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది. కంగన లాంటి పెద్ద నటి ఈ ఆరోపణ చేయడంతో అతను మరింత ఇబ్బందుల్లో పడ్డాడు. అయితే క్వీన్‌ సినిమాకి కంగన కాస్టూమ్స్‌ చూసుకున్న యువతి ఆమె చేస్తోన్న ఆరోపణలు నిజం కాదని, ఆ దర్శకుడు అలా ప్రవర్తించడం ఎప్పుడూ తన కంట పడలేదని, ఇంత మంది ఆరోపణలు చేస్తోన్న వ్యక్తి లక్షణాలు ఖచ్చితంగా అందరికీ కనిపించి వుండేవని, ఇది అతడిపై జరుగుతోన్న వ్యక్తిగత దాడి అని బాలీవుడ్‌ మీడియాకి చెప్పింది. పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ యువతి క్వీన్‌ దర్శకుడికి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.

అయితే కంగనకి అతడిపై ఆరోపణలు చేయడం వల్ల ఒరిగేదేమిటి? వికాస్‌ ప్రస్తుతం తీస్తోన్న చిత్రంలో హీరో హృతిక్‌ రోషన్‌. సూపర్‌ 26 పేరుతో రూపొందుతోన్న ఆ చిత్రం కంగన నటిస్తోన్న 'మణికర్ణిక'కి పోటీగా విడుదల కానుంది. హృతిక్‌తో కంగన రిలేషన్‌ ఎలాంటిదో తెలిసిందే కనుక ఆ సినిమాని ఎఫెక్ట్‌ చేయడానికి సదరు దర్శకుడిపై తను కూడా బురద జల్లేస్తోందనేది ఒక వాదన. ఇందులో నిజానిజాలేమిటో వికాస్‌, కంగనకే తెలియాలి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English