అరవింద సమేత షోస్‌ ఆపండమ్మా!

  అరవింద సమేత షోస్‌ ఆపండమ్మా!

ఒక భారీ సినిమాకి ఎలాంటి టాక్‌ వచ్చినా కానీ తొలి రోజు, ఒక్కోసారి తొలి వారాంతం వరకు ఎలాంటి ఢోకా వుండదు. చూడాలని ఫిక్స్‌ అయిన వాళ్లు టాక్‌తో సంబంధం లేకుండా చూసేస్తారు. కానీ ఓవర్సీస్‌ మార్కెట్‌ అలా వుండదు. బ్యాడ్‌ టాక్‌ జనరేట్‌ అయిందంటే ప్రీమియర్స్‌ వసూళ్ల మీదే ప్రభావం పడిపోతుంది. భారీ వసూళ్ల దిశగా వెళుతోన్న సినిమా కాస్తా సడన్‌గా డ్రాప్‌ అయిపోతుంది. ఇక తొలి వారాంతంలో సదరు సినిమాకి వచ్చే వసూళ్లకి బయ్యర్లు రక్త కన్నీరు కార్చాల్సిందే.

మొదటి షో పడే సరికి టాక్‌ ఎలాగో వచ్చేస్తుందని తెలుసు. తమ సినిమాపై తమకి ఎంత నమ్మకమున్నా కానీ ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారు, ఏ విధంగా రియాక్ట్‌ అవుతారనేది తల పండిన వారికి కూడా తెలీదు. అందుకే టాక్‌ తేడా అయితే బాగా ఎఫెక్ట్‌ అయ్యే ఓవర్సీస్‌ మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని 'అరవింద సమేత' షోస్‌ తెలుగు రాష్ట్రాల్లో లేట్‌గానే మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు.

రాత్రి పూట షోస్‌ వేస్తే యుఎస్‌లో ప్రీమియర్లు మొదలు కాకముందే టాక్‌ స్ప్రెడ్‌ అవుతుంది. దాంతో ఎనిమిది గంటల తర్వాత వేసే షోస్‌పై ప్రభావం పడుతుంది. మంచి టాక్‌ వస్తే ఓకే కానీ ఛాన్స్‌ తీసుకోవడం దేనికని యుఎస్‌తో పాటుగా ఇక్కడ షోలు కూడా పడేలా ప్లాన్‌ చేసుకోమని బయ్యర్లకి ఆర్డర్లు వెళ్లాయి. తెలంగాణలో అయితే ఎన్నికల కారణంగా స్పెషల్‌ షోస్‌ ఏమీ లేవు. ఆంధ్రప్రదేశ్‌లో వేసే షోలు కూడా తెల్లవారుఝామునే మొదలవుతాయట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English