ఎన్టీఆర్‌ ఫస్ట్‌ హిట్‌ ఇస్తాడా?

  ఎన్టీఆర్‌ ఫస్ట్‌ హిట్‌ ఇస్తాడా?

ఎన్టీఆర్‌ అభిమానులు ఏళ్ల తరబడి ఎదురు చూసిన ఆ తరుణం రానే వచ్చింది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ని చూడాలనేది అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తోన్న రోజు. త్రివిక్రమ్‌ తనదైన ఫ్యామిలీ కథలో ఎన్టీఆర్‌ని చూపించడం కాకుండా ఎన్టీఆర్‌ శైలి యాక్షన్‌ సినిమాకి తన టచ్‌ ఇచ్చి తీసిన చిత్రం 'అరవింద సమేత'. అంచనాలు ఎలా వున్నాయనేది అడ్వాన్స్‌ బుకింగ్స్‌ చూస్తేనే అర్థమవుతోంది.

గురువారం ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో కూడా బాక్సాఫీస్‌ వద్ద ప్రకంపనలు ఖాయం. ఎన్టీఆర్‌కి, త్రివిక్రమ్‌కి విజయాలు కొత్త కాదు కానీ ఈ చిత్ర విజయం 'అరవింద'గా నటించిన పూజా హెగ్డేకి చాలా కీలకం. ఎందుకంటే ఆమెకి వరుసగా స్టార్‌ హీరోలతో నటించే అవకాశాలు పొందే గ్లామర్‌ వున్నా, యూత్‌లో ఆమెకి వెర్రి అభిమానులు వున్నా ఇంతవరకు సక్సెస్‌ని చవిచూడలేదు. 'డిజె' ఒక్కటీ ఓపెనింగ్స్‌తో సరిపెట్టింది కానీ హీరోయిన్‌గా పూజాకి సక్సెస్‌ రాలేదు. 'రంగస్థలం'లో ఐటెమ్‌ గాళ్‌గా కనిపించి ఆ విజయానందాన్ని షేర్‌ చేసుకుందంతే.

అందుకే అరవింద సమేతపై ఆమె చాలా ఆశలే పెట్టుకుంది. చేతిలో చాలా పెద్ద సినిమాలు వున్నా కానీ ఈ చిత్రం కనుక మిస్‌ఫైర్‌ అయిందంటే తనని మిస్‌ ఐరన్‌ అనేస్తారని పూజాకి తెలుసు. మరి తారక సమేత పూజ ఘన విజయాన్నే అందుకుంటుందో లేక పూజా సమేత తారక్‌ ఫ్లాప్‌ కాంబినేషన్‌ అనిపించుకుంటుందో రేపటికి క్లారిటీ వచ్చేస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English