ఎన్టీఆర్.. ఆ ఫీట్ సాధిస్తాడా?

ఎన్టీఆర్.. ఆ ఫీట్ సాధిస్తాడా?

జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ‘అరవింద సమేత వీర రాఘవ’ ఇంకొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. యుఎస్‌లో ముందు రోజు మధ్యాహ్నం నుంచే ప్రిమియర్లు పడిపోతున్నాయి. అంటే భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి దాటాక సినిమా టాక్ ఏంటో తెలిసిపోతోంది. తెలుగులో భారీ సినిమాలు వచ్చి చాలా రోజులైంది. వేసవి తర్వాత పెద్ద స్టార్ సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. ద్వితీయార్ధంలో ఇంకే భారీ చిత్రం కూడా లేదు. దీంతో ‘అరవింద సమేత’పై మామూలు హైప్ లేదు.

ఇంతకుముందు ఓవర్సీస్‌లో ఎన్టీఆర్ మార్కెట్ చాలా వీక్‌గా ఉండేది. కానీ గత కొన్నేళ్లలో అక్కడ అతడికి ఫాలోయింగ్, మార్కెట్ పెరిగింది. ‘నాన్నకు ప్రేమతో’.. ‘జనతా గ్యారేజ్’ లాంటి సినిమాలు తారక్‌ను అక్కడ కూడా స్టార్‌ని చేశాయి. ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్లో మంచి పట్టున్న త్రివిక్రమ్‌తో జట్టు కట్టడం కూడా ఎన్టీఆర్‌కు బాగా కలిసొస్తోంది.

‘అరవింద సమేత’ను ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యంత భారీగా రిలీజ్ చేస్తున్నారు యుఎస్‌లో. ప్రిమియర్లు కూడా చాలా ఎక్కువగానే పడుతున్నాయి. ప్రి సేల్స్ కూడా అదిరిపోతున్నాయి. మంగళవారానికే ప్రి సేల్స్ 2 లక్షల డాలర్ల మార్కును దాటేయడం విశేషం. బుధవారం కూడా టికెట్లు పెద్ద ఎత్తున సేల్ అవుతున్నాయి. ఈ ట్రెండ్ చూస్తుంటే.. ప్రిమియర్లతోనే ‘అరవింద సమేత’ మిలియన్ డాలర్ల మార్కును అందుకుంటుందేమో అన్న అంచనాలు కలుగుతున్నాయి.

ఇప్పటిదాకా ‘బాహుబలి’ని మినహాయిస్తే.. మహేష్ బాబు సినిమాలకు మాత్రమే ఇలాంటి ఊపు కనిపించేది. ఇప్పుడు ప్రిమియర్లతోనే మిలియన్ డాలర్ల మార్కును అందుకున్న అరుదైన జాబితాలో తారక్ కూడా చేరేలా కనిపిస్తున్నాడు. పాజిటివ్ టాక్ వస్తే.. ‘అరవింద సమేత’ 3 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English