ఔను నేను కన్నింగే-కౌశల్

ఔను నేను కన్నింగే-కౌశల్

‘బిగ్ బాస్’ రెండో సీజన్లో విజేతగా నిలిచిన కౌశల్‌కు భారీగా అభిమానులే కాదు.. హేటర్స్ కూడా ఉన్నారు. ఆ హేటర్స్‌ కౌశల్‌లోని నెగెటివ్ పాయింట్స్ వెతికే ప్రయత్నం చేస్తుంటారు. కౌశల్ గేమ్‌లో కనిపించినంత అమాయకుడేమీ కాదని.. అతను కన్నింగ్ అని కూడా అంటుంటారు. ఇదే మాట తాజాగా ఒక ఇంటర్వ్యూలో అంటే.. కౌశల్ దానికి ఔనని సమాధానం చెప్పడం విశేషం. గేమ్ పరంగా అయితే తాను కన్నింగే అని అతను పేర్కొన్నాడు.

‘‘నా గేమ్‌లో డెఫినిట్‌గా నేను కన్నింగ్‌. ఎందుకంటే కన్నింగ్‌గా లేకపోతే గేమ్‌ ఆడలేం, ముందుకు వెళ్లలేం. నాకొక టాస్క్‌ ఇస్తే, నేను దాన్ని పది రకాలుగా డివైడ్‌ చేసుకుంటాను. ఆ పది రకాల్లో ఆ సమయానికి ఏది సూటవుతుందో, ఆ రకాన్ని పిక్‌ చేసుకుని ముందుకు వెళతాను. నా వ్యక్తిత్వం నచ్చి కొంతమంది అభిమానులు తయారయ్యారు. దీంతో వాళ్లు కోరుకున్నట్లు ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ప్రతీ టాస్క్‌ కూడా క్రియేటివ్‌గా పూర్తి చేసుకుంటూ వచ్చాను. ఇందులో కన్నింగ్‌నెస్ కనిపిస్తే కనిపించవచ్చు. ఐతే అదంతా గేమ్ గెలవడానికే’’ అని కౌశల్ చెప్పాడు.

నిజానికి ‘బిగ్ బాస్’ మొదలైన రెండో వారానికే తాను హౌస్ నుంచి వెళ్లిపోవాలని అనుకున్నానని.. కానీ నాని చెప్పాకే ఆగానని కౌశల్ వెల్లడించాడు. ‘‘ఆ సమయంలో బయట ఎంతో హ్యాపీగా షూటింగ్స్‌, ఈవెంట్స్‌ చేసుకుని బతుకుతున్నాం. ఇక్కడ ఒక షోకు వచ్చి ఇన్ని మాటలు పడాల్సిన అవసరం ఏంటనిపించింది. ‘నేను వెళ్లిపోవాలనుకుంటున్నాను’ అని నానితో చెప్పాను. అప్పుడాయన... ‘షో ప్రారంభమై రెండు వారాలే అయింది. అప్పుడే వేల మంది అభిమానులు నీ కోసం చూస్తున్నారు. నువ్వేంటో రుజువు చెయ్యాలి’ అన్నాడు. నాకు అంత మంది అభిమానులున్నారని తెలిసి షో గెలవాలని నిర్ణయించుకున్నా’’ అని కౌశల్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English