ఈ బ్యాచ్ పరిస్థితి ఏంటి? అంతే సంగతులా!

ఈ బ్యాచ్ పరిస్థితి ఏంటి? అంతే సంగతులా!

బిగ్ బాస్.. అంతా అయిపోయింది. అదేనండీ రెండో సీజన్ కూడా పూర్తయిపోయింది. అయితే బిగ్ బాస్ లో పాల్గొంటే చాలా క్రేజ్ డబుల్ అయిపోయి ఫిలింస్ లో చాలా బిజీ అయిపోతాం అని చాలామంది ఆశపడి ఈ కార్యక్రమంలో ఎగిరిగంతేసి పాల్గొన్నవారు ఉన్నారు. ఇక బిగ్ బాస్ 2 విషయంలో కౌశల్ కు చాలా హైప్ వచ్చింది కాని.. మిగతా బ్యాచ్ పరిస్థితి ఏంటంటారు?

నిజానికి ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నా పాల్గొనకపోయినా కూడా.. యాంకర్ శ్యామలకు మాత్రం ఆమెకు వచ్చే ఆఫర్లు ఆమెకు ఉన్నాయి. సుమ రాలేదనో ఝాన్సీ ఖాళీగా లేదనో అనసూయ చెయ్యనందనో.. ఇలా చాలా సినిమా ఫంక్షన్లకు శ్యామల ఒక్కతే మెగా బ్యాకప్. అందుకే ఆమెకు ఈ ప్రోగ్రాం చేసిన మేలేం లేదు. కాకపోతే జనాలు మర్చిపోతున్న తనీష్‌, సామ్రాట, తేజస్వి, పూజ వంటి కంటెస్టంట్లకు మాత్రం ఎంతోకొంత ఉపయోగం ఉంటుంది. కాని వాళ్ళలో తేజస్వికి తప్పిస్తే ఎవ్వరికీ మైలేజ్ రాలేదు. అలాగే జనాలకు ఏమాత్రం గుర్తులేని భానుశ్రీ, నందిని రాయ్ వంటి భామలకు ఈ ప్రోగ్రాం కాస్త ప్లస్సే అయ్యింది. అయితే వీళ్లందరూ ఒక్కసారి టివి నుండి వెళిపోయాక.. అదేనండి బిగ్ బాస్ అయిపోయాక.. అసలు వీళ్ళను ఎవ్వరూ గుర్తుపెట్టుకోవట్లేదు. ఫిలిం ఇండస్ర్టీలో కూడా వీళ్ళ ఊసే లేదంట. అంతే సంగతులు అంటున్నారు విశ్లేషకులు.

చూస్తుంటే అప్పట్లో బిగ్ బాస్ 1 పూర్తవ్వగానే.. నవదీప్, శివబాలాజీ, ముమాయత్, వేద, సింగర్ మధుప్రియలను ఎలాగైతే అందరూ మర్చిపోయారో ఇప్పుడు ఈ బ్యాచ్ ను కూడా అలాగే మర్చిపోయేలాగా ఉన్నారు జనాలు. ఇక కంటెస్టంట్ల పరిస్థితే అగమ్యగోచరంగా ఉంటే.. ఈ కౌశల్ ఆర్మీలు.. గీతా వారియర్స్.. తనీష్‌ టాస్క్ ఫోర్స్ అంటూ ఊరూపేరూ లేకుండా పుట్టకొక్కుల్లా పుట్టుకొచ్చిన అసోసియేషన్లు ఏమైపోతాయంటారు? ట్విట్టర్ గర్బంలో కలసిపోవాల్సిందేనా?? 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English