నట కిరీటి బ్యాండ్ విడ్త్ తగ్గించుకోవాలి సుమీ

నట కిరీటి బ్యాండ్ విడ్త్ తగ్గించుకోవాలి సుమీ

నట కిరీటిగా రాజేంద్ర ప్రసాద్ ఎన్నో శిఖరాలను చూశాడు. సోలో హీరోగా లాభంలేదనే ముందే తెలుసుకున్న ఈయన.. బోలెడన్ని మల్టీ స్టారర్లు కూడా చేశాడు. ఆ తరువాత తండ్రి పాత్రలకు కూడా సిద్దమయ్యాడు. అయితే చంద్రుడి మీద మచ్చల టైపులో ఈయనకు లూజ్ టంగ్ అనే చిన్న సమస్య ఉంది. అప్పుడప్పుడూ దానికి బ్యాండ్ విడ్త్ ఎక్కువైపోయి.. వంద మెగాబైట్ల స్పీడులో పంచులు వేస్తుంటుంది. అదిగో అక్కడే వచ్చింది చిచ్చంతా.

ఓ వారం క్రితం 'బేవర్స్' అనే సినిమా ప్రెస్ మీట్లో రాజేంద్రప్రసాద్ కొన్ని చిలిపి చేష్టలతో పాటు కాస్త ఇబ్బందైనా కామెంట్లు కూడా చేశారు. హీరోయిన్లు అందరినీ తన పక్కనే వచ్చి నుంచోమని చెబుతూ.. అలాగే యాంకర్ కూడా తన పక్కనే నుంచోవాలని.. సీనియర్ అయిన తాను ఎంతో బెటరని కాస్త రసవత్తరంగా బిహేవ్ చేశాడు రాజా వారు. పోనీ అదే చిలిపితనం అనుకుంటే.. ఆ తరువాత కూతురు గురించి రాసిన ఒక పాట గురించి చెబుతూ.. లవ్ మ్యారేజ్ చేసుకుందని తన కూతురు గాయత్రితో కొన్ని సంవత్సరాలుగా మాట్టాడట్లేదని.. ఇప్పుడు ఆమెను పిలిచి ఈ పాటను నాలుగుసార్లు వినిపించాను అంటూ తన కుటుంబం తాలూకు విషయాలు ఆరబోశాడు. కాని ఇదంతా ఆయన కుటంబ సభ్యులకు నచ్చలేదట. అందుకే ఇప్పుడు వారికి సారీ చెప్పి చాలా ఫీలైనట్లు మీడియాతో మరోసారి పంచుకుంటున్నాడు.

ఏదేమైనా కూడా.. నట కిరీటి వంటి సీనియర్ స్టార్లు చాలా జాగ్రత్తగా మాట్టాడితేనే బెటర్. ఎందుకంటే వారు చేసే ఒక్కో కామెంట్ ఇప్పటి జెనరేషన్ పై వేరే రకంగా ప్రభావం చూపే ఛాన్సుంటుంది. సినిమాల్లోనేమో ప్రేమ గొప్పది గుడ్డిది పవిత్రమైనది అంటూ క్లాసులు పీకుతూ.. నిజజీవితంలో మాత్రం ప్రేమించినందుకు కూతురితో మాట్లాడట్లేదు అని చెబితే.. జనాలు ఏమని అర్ధంచేసుకుంటారు.. అందుకే బ్యాండ్ విడ్త్ తగ్గించుకోమనేది!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English