దిల్‌ రాజు చేతిలో ఆమె ఫ్యూచర్‌

  దిల్‌ రాజు చేతిలో ఆమె ఫ్యూచర్‌

వరుస విజయాలతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే బిజీ అయిపోయిన అనుపమ పరమేశ్వరన్‌కి ఆ తర్వాత టైమ్‌ కలిసి రావడం లేదు. ఆమె ఇటీవల నటించిన చిత్రాలన్నీ ఫ్లాప్‌ అయ్యాయి. 'ఉన్నది ఒకటే జిందగీ', 'తేజ్‌ ఐలవ్యూ', 'కృష్ణార్జున యుద్ధం' ఫెయిల్‌ అవడంతో ఆమెకి అవకాశాలు తగ్గాయి.

'ఉన్నది ఒకటే జిందగీ' ఫ్లాప్‌ అయినా కానీ అందులో అనుపమ పర్‌ఫార్మెన్స్‌ బాగా నచ్చడంతో రామ్‌ తన మలి చిత్రంలోను ఆమె పేరునే సిఫార్సు చేసాడు. అలా దిల్‌ రాజు నిర్మించిన 'హలో గురూ ప్రేమకోసమే'లో అవకాశం దక్కించుకున్న అనుపమ ఇప్పుడు తన ఆశలన్నీ దీని మీదే పెట్టుకుంది.

రామ్‌, దిల్‌ రాజు ఇద్దరూ ఫామ్‌ కోల్పోయినా కానీ దర్శకుడు త్రినాధరావు నక్కిన మాత్రం ఊపు మీద వున్నాడు. సినిమా చూపిస్త మావ, నేను లోకల్‌ చిత్రాలతో వినోదాత్మక చిత్రాలు అందిస్తాడనే పేరు అతనికి వుంది. అయితే ఈ చిత్రానికి క్రేజ్‌ మాత్రం లేదనే చెప్పాలి. టీజర్‌ కానీ, ఇంతవరకు విడుదల చేసిన పాటలు కానీ దీనిపై ఎలాంటి అంచనాలు రేకెత్తించలేకపోయాయి.

అసలే పోటీ వాతావరణంలో వస్తోన్న ఈ చిత్రం ఎంతవరకు నిలదొక్కుకుంటుందనేది చూడాలి. ఈ చిత్రం కానీ ఫెయిలయితే అనుపమకి కొత్త అవకాశాలు రావడం చాలా కష్టమవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English