రేప్ ఆరోపణల వల్లే ప్రొడక్షన్ హౌస్ క్లోజ్

రేప్ ఆరోపణల వల్లే ప్రొడక్షన్ హౌస్ క్లోజ్

బాలీవుడ్ విలక్షణ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో పాటు ఇంకో ముగ్గురు ప్రముఖులు కలిసి ‘ఫాంటమ్’ పేరుతో నిర్మాణ సంస్థను మొదలుపెట్టి అద్భుతమైన సినిమాలు అందించారు. ఇండియన్ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో మైలురాయిలా నిలిచిపోయిన ‘క్వీన్’ దగ్గర్నుంచి లేటెస్ట్ హిట్ ‘మన్మర్జియాన్’ వరకు ఈ సంస్థ నుంచి చాలా మంచి చిత్రాలొచ్చాయి.

‘నెట్ ఫ్లిక్స్’ కోసం వీళ్లు చేసిన ‘సేక్రెడ్ హార్ట్స్’ సైతం అద్భుతమైన స్పందన రాబట్టుకుంది. ఇంత మంచి సినిమాలు అందించిన ‘ఫాంటమ్’ సంస్థను హఠాత్తుగా మూసేయడం బాలీవుడ్ జనాలకు పెద్ద షాకే. ఐతే నష్టాల వల్లే ప్రొడక్షన్ హౌస్ మూసేస్తున్నారని ముందు వార్తలొచ్చాయి. కానీ అది నిజం కాదట. ఈ సంస్థ అధినేతల్లో ఒకడు.. ‘క్వీన్’ డైరెక్టర్ కూడా అయిన వికాస్ బల్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలే సంస్థ మూత పడటానికి కారణమయ్యాయని తెలుస్తోంది.

ఏడాది నుంచి ప్రపంచవ్యాప్తంగా సినీ పరిశ్రమల్లో ‘మి టు’ మూమెంట్ ఉద్ధృతంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కోవలోనే తనూశ్రీ దత్తా.. నానా పటేకర్ మీద చేసిన ఆరోపణలు ప్రకంపనలు రేపుతున్నాయి. అదే సమయంలో వికాస్ మీద ఓ నటి చేసిన ఆరోపణలూ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీనికి సంబంధించిన కేసు విచారణ ఊపందుకుంది. వికాస్ విషయంలో మౌనం వహిస్తూ వచ్చిన కశ్యప్, మిగతా నిర్మాతలు.. ఇప్పుడు ఓపెన్ అయ్యారు.

వికాస్ ఇష్యూను తాము సరిగా డీల్ చేయలేదని.. అతను చేసింది పొరబాటే అని కశ్యప్ తాజాగా వ్యాఖ్యానించాడు. ప్రొడక్షన్ హౌస్ మూయడానికి ఇదీ కారణం అని చెప్పలేదు కానీ.. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో కలిసి సినిమాలు తీయడం సరి కాదని భావించి వీళ్లు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English