50 లక్షల సినిమా తీస్తానంటున్న దర్శకేంద్రుడు

50 లక్షల సినిమా తీస్తానంటున్న దర్శకేంద్రుడు

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు భారీ చిత్రాలకు పెట్టింది పేరు. దర్శకుడిగా ఆయన మూడో సినిమానే ‘అడవి రాముడు’. అప్పట్లోనే భారీ బడ్జెట్లో ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత బిగ్ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిపోయారు. చివరగా రాఘవేంద్రరావు తీసిన ‘ఓం నమో వేంకటేశాయ’ కూడా పెద్ద బడ్జెట్లోనే తెరకెక్కింది.

ఐతే కంటెంట్ ప్రధానంగా సాగే ఓ కథను రూ.50 లక్షల బడ్జెట్లో తీసి తాను ఇలాంటి సినిమాలు కూడా తీయగలనని రుజువు చేసుకోవాలని ఉందని ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అలాగే హిందీలో వచ్చిన ‘బాగ్ మిల్కా బాగ్’ లాంటి సినిమా కూడా తీయాలనుందన్నారు. ‘గాంధీ’ సినిమాను మనవాళ్లు కాకుండా విదేశీయులు తీయడం బాధాకరమని రాఘవేంద్రరావు చెప్పారు.

తెలుగులో కొన్నేళ్ల ముందు వరకు పెద్దగా ప్రయోగాలు జరిగేవి కావని.. గత రెండేళ్లలో పరిస్థితి చాలా మారిందని ఆయన అన్నారు. రామ్ చరణ్ లాంటి హీరోతో సుకుమార్ లాంటి దర్శకుడు చెవిటివాడి పాత్ర చేయించారని.. తానైతే అలా చేయించగలిగేవాడిని కాదని.. గతంలో హీరోలు ఇమేజ్ అడ్డం వచ్చేదని చెప్పాడు తెలుగులో కొత్తదనం పెరుగుతోందని.. కొత్తవాళ్లు ఎంత బాగా చేస్తున్నారో చెప్పడానికి ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమానే నిదర్శనమని రాఘవేంద్రరావు అన్నారు.

కెరీర్లో ఎన్నో రకాల సినిమాలు తీశానని.. ఐతే ‘మహాభారతం’ తీస్తే బాగుండేదని దర్శకేంద్రుడు చెప్పారు. ఆ చిత్రాన్ని ఇంగ్లిష్‌లో తీయాలని తాను ఒకప్పుడు అనుకున్నానని.. ఐతే తాను చేయకపోయినా తన శిష్యుడు రాజమౌళి ‘మహాభారతం’ తీస్తే అద్భుతంగా ఉంటుందని ఆయనన్నారు. రామోజీ రావు లాంటి నిర్మాత అయితేనే ఇలాంటి సినిమాను ప్రొడ్యూస్ చేయగలరన్నాడు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English