గొడవే లేదంది.. ఇప్పుడు చిన్న గొడవంటోంది

గొడవే లేదంది.. ఇప్పుడు చిన్న గొడవంటోంది

‘హలో గురూ ప్రేమ కోసమే’ షూటింగ్ సందర్భంగా సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్‌కు, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌కు మధ్య గొడవ జరిగిందని.. ప్రకాష్ రాజ్ తనను తిట్టడంతో అనుపమ హర్టయి కన్నీళ్లు పెట్టుకుందని.. దీంతో షూటింగ్ వాతావరణం దెబ్బ తిందని.. కొన్ని రోజుల పాటు వీరి మధ్య మాటలు కూడా లేవని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

ఐతే ఈ వార్తల్ని అనుపమ ఇంతకుముందే ఖండించింది. తమ మధ్య గొడవేమీ లేదంటూ ఇద్దరూ కలిసి నవ్వుతున్న ఫొటో షేర్ చేసింది. ఐతే ఆమె ఎంత వివరణ ఇచ్చినప్పటికీ ఈ గొడవ గురించి ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనుపమ మరోసారి స్పందించింది.

‘‘మేమిద్దరం దాదాపు ఆరు నెలలు కలిసి పనిచేశాం. మా మధ్య జరిగిన చిన్న సంఘటనను బయట చాలా పెద్దది చేశారు. ప్రకాష్ రాజ్ నాకు ఒక విషయం ఓ చిన్న సలహా ఇచ్చారు. ఇది కాస్తా ఒకరి నుంచి మరొకరికి చేరే సరికి చిలవలు పలవలైంది. ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా మేము 25 రోజులపాటు కలిసి షూటింగ్‌లో పాల్గొన్నాం. ఇప్పటికీ మా మధ్య మంచి సంధాలున్నాయి. మేమిద్దరం కలిసి పనిచేయడాన్ని ఆస్వాదించాం. జరిగిన చిన్న విషయాన్ని వాళ్ల సొంత కథనాలు జోడించి చెప్పడంలోనే జనానికి ఆసక్తి ఉంటోంది’’ అని అనుపమ వివరించింది.

ఐతే ఇంతకుముందు తమ మధ్య అసలేమీ జరగలేదన్న అనుపమ ఇప్పుడు చిన్న సంఘటన జరిగిందని.. దాన్ని పెద్దది చేసి చూపించారని అనడం గమనార్హం. మరి భవిష్యత్తులో దీని గురించి ఇంకేమంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English