బాయ్ ఫ్రెండ్‌ను చూడ‌మ‌ని అమ్మ‌కు చెప్పింద‌ట‌

బాయ్ ఫ్రెండ్‌ను చూడ‌మ‌ని అమ్మ‌కు చెప్పింద‌ట‌

కాలం మారింది. అందుకు త‌గ్గ‌ట్లే అమ్మానాన్న‌ల‌తో పిల్ల‌ల అనుబంధాలు మారిపోతున్నాయి. త‌ల్లిదండ్రులు పేరెంట్స్ మాదిరి కాకుండా ఫ్రెండ్స్ గా ఉండ‌టం ఈ మ‌ధ్య‌న ఎక్కువైంది. ఎవ‌రికో ఏదో షేర్ చేసుకునే క‌న్నా.. అన్నీ త‌మ‌కు ఇచ్చే త‌ల్లిదండ్రుల్ని స్నేహితులుగా ఫీలై త‌మ ఫీలింగ్స్ షేర్ చేసుకోవ‌టం ఈ మ‌ధ్య‌న కొత్త‌గా చోటు చేసుకున్న ప‌రిణామం. అయితే.. అదెంత వ‌ర‌కూ వెళ్లింద‌న్న విష‌యాన్ని రీల్ గీత‌.. రియ‌ల్ ర‌ష్మిక మాట‌ల్లో వింటే ఆశ్చ‌ర్య‌క‌రంగా అనిపించ‌క మాన‌దు.

తాజాగా ఒక మీడియా సంస్థ‌కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో త‌న పేరెంట్స్ తో త‌న‌కుండే చ‌నువు.. వారి ద‌గ్గ‌ర త‌న‌కుండే స్వేచ్ఛ గురించి ఆమె వెల్ల‌డించారు. అంతేనా.. త‌న ప్రేమ గురించి.. ఎంగేజ్ మెంట్ అయ్యాక బ్రేకప్ అయిన వైనం వ‌ర‌కూ వివ‌రించారు.

పేరెంట్స్ తో త‌న‌కు చ‌నువు ఎక్క‌వ‌ని.. భ‌రోసా కూడా ఎక్కువేన‌ని చెప్పారు. అమ్మ‌ని స్నేహితురాలిగా స‌ర‌దా ప‌ట్టించ‌టం.. ఆట ప‌ట్టిస్తుంటాన‌ని చెప్పింది. త‌న ఫీలింగ్స్ అని చెప్పుకుంటాన‌ని చెబుతూ.. అంద‌రికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు.. నాకెందుకు లేర‌మ్మా? .నాకో బాయ్ ఫ్రెండ్ కావాల‌ని అమ్మ‌ను చాలాసార్లు అడిగా అంటూ న‌వ్వుతూ చెప్పింది ర‌ష్మిక‌.

అంతేనా.. ఈ అబ్బాయి బాగున్నాడా?  ఆ అబ్బాయి బాగున్నాడా?  అంటూ చాలామందిని చూపించేదానిన‌ని.. తాను చేసే స‌ర‌దాను అమ్మ కూడా అంతే స‌ర‌దాగా తీసుకునేద‌ని చెప్పారు. కిరిక్ పార్టీ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే ఆ సినిమా హీరో ర‌క్షిత్ శెట్టిపై అభిమానం కాస్తా ప్రేమ‌గా మారింద‌ని.. ఈ విష‌యాన్ని మొద‌ట అమ్మ‌తోనే చెప్పిన‌ట్లు చెప్పింది.

తాను తీసుకున్న‌ది స‌రైన నిర్ణ‌య‌మేనా? అని అమ్మ‌ను అడిగాన‌ని.. ఎందుకంటే ఈ వ‌య‌సులో కంటికి అంద‌రూ మంచివాళ్లుగానే క‌నిపిస్తార‌ని.. కానీ త‌ల్లిదండ్రుల‌కు మాత్రం ఏది మంచిదో ఆలోచించి చెబుతార‌న్నారు. త‌న అభిప్రాయానికి విలువ‌నిస్తూ.. నీ ఇష్టం.. నీకు ఏది మంచి అనిపిస్తే అది చేయ్ అంటూ త‌న అభిప్రాయానికి విలువ‌నిచ్చార‌న్నారు.

అయితే.. త‌మ ప్రేమక‌థ ఎంగేజ్ మెంట్ తోనే ఆగిపోయింద‌ని.. అంతా బాగుంద‌ని అనుకున్న‌ప్పుడు ఆ బంధాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చ‌ని.. కానీ పొర‌పాట్లు.. లోటుపాట్లు క‌నిపిస్తే దాన్ని అక్క‌డితో వ‌దిలేయ‌టం మంచిద‌ని తాను న‌మ్ముతాన‌ని చెప్పారు. అలా కాకుండా.. అదే ప‌నిగా ముందుకు వెళితే భ‌విష్య‌త్తులో చాలా కోల్పోతామ‌ని చెప్పారు. జ‌రిగిన దానితో తాను ప్రేమ‌ను న‌మ్మ‌కుండా ఉండ‌లేనని.. ప్రేమ గొప్ప‌ద‌ని.. అది చూసే క‌ళ్ల‌ను బ‌ట్టి ఉంటుంద‌ని చెప్పింది. మొత్తానికి బ్రేక‌ప్ అనే మాట‌ను చెప్పింది కానీ.. కార‌ణం ఏమ‌న్న‌ది మాత్రం చెప్ప‌లేదుగా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English