గీతా గోవిందం సెట్లో ఏడ్చేసింద‌ట‌!

గీతా గోవిందం సెట్లో ఏడ్చేసింద‌ట‌!

కొన్నిసార్లు అంతే.. అదృష్టం త‌న్నుకుంటూ వ‌స్తుంది. కొంత‌మంది అందంలోనూ.. అభిన‌యంలోనూ వంక పెట్టలేనంత‌గా ఉన్నా.. స్టార్ డ‌మ్ రాదు. ఇందుకు భిన్నం మ‌రికొంద‌రి ప‌రిస్థితి. ఒక్క సినిమాతోనే ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోతారు. తాజాగా అలాంటి ల‌క్కీఫెలోగా రీల్ గీత‌గా చెబుతుంటారు.

టాలీవుడ్‌లో హీరోయిన్లు ఎంతోమంది ఉన్నా.. ర‌ష్మిక ఇప్పుడు హాట్ టాపిక్. ఆమె పేరు విన్నంత‌నే యూత్ ఊగిపోతోంది. ఆమెను త‌మ క‌ల‌ల రాణిగా ఫీల‌య్యే వారికి కొద‌వ లేదు. ఛ‌లో సినిమాతో తెలుగు తెర‌కు ఎంట్రీ ఇచ్చినా.. గీతా గోవిందం మూవీతో ఆమె ఇమేజ్ ఎక్క‌డికో వెళ్లిపోయింది. ఆ సినిమాతో ఆమె తిరుగులేని స్థానానికి చేరుకుంది.

ప్ర‌స్తుతం తెలుగులో రెండు సినిమాలో.. క‌న్న‌డ‌లో ఒక సినిమా చేస్తూ బిజీబిజీగా ఉన్న ఆమె తాజాగా ఒక ఆస‌క్తిక‌ర అంశాన్ని చెప్పారు. త‌న కెరీర్ మొత్తాన్ని.. ఆ మాట‌కు వ‌స్తే త‌న ఇమేజ్ మొత్తాన్ని మారేలా చేసిన గీతా గోవిందం షూట్ సంద‌ర్భంగా ఒక‌సారి తాను విప‌రీతంగా ఏడ్చిన విష‌యాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు.

త‌న‌తో ఎవ‌రైనా న‌వ్వుతూ మాట్లాడ‌క‌పోతే తానుచాలా ఇబ్బంది ప‌డిపోతాన‌ని చెప్పారు ర‌ష్మిక‌. గీత గోవిందం క్లైమాక్స్ తీస్తున్న‌ప్పుడు ఒక రోజు తాను షూట్‌కి ఆల‌స్యంగా వెళ్లాన‌ని చెప్పారు. తాను సెట్‌లోకి వెళ్లిన త‌ర్వాత‌.. ఎవ‌రూ త‌న‌ను ప‌లుక‌రించ‌లేదుని.. తాను ప‌లుక‌రించినా త‌న వంక కూడా చూడ‌లేద‌న్నారు.

దీంతో.. ఓ చోట కూర్చొని ఏడ్చేసిన‌ట్లు చెప్పారు. త‌న ఏడుపుతో ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చిన ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్‌.. ఇదంతా త‌న‌ను ఆట ప‌ట్టించేందుకే చేశార‌ని.. త‌న వెనుకే ఒక కెమేరా ఫాలో అయిన వైనాన్ని చూపించారు. అప్ప‌టివ‌ర‌కూ త‌న‌ను ఒక కెమేరా ఫాలో అవుతుంద‌న్న విష‌యాన్ని గుర్తించ‌లేద‌ని చెప్పింది.

త‌న‌కు పాట‌లంటే పిచ్చి అని.. త‌న మూడ్‌కి త‌గ్గ‌ట్లు మెలోడీలు.. విషాద గీతాలు.. హుషారు పాట‌లు వింటాన‌ని.. పుస్త‌కాలు మాత్రం చ‌ద‌వ‌న‌న్నారు. ఒక‌వేళ బుక్ ను ముట్టుకుంటే చాలు నిద్ర త‌న్నుకు వ‌స్తుంద‌ని చెప్పిన ఆమె.. తాను గ‌రిటె కూడా తిప్పుతాన‌ని.. కేక్ బాగా త‌యారు చేస్తాన‌ని చెప్పింది రీల్ గీత‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English