రష్మిక బ్రేకప్.. విజయ్‌ని మాట్లాడమంటే?

రష్మిక బ్రేకప్.. విజయ్‌ని మాట్లాడమంటే?

‘ఛలో’.. ‘గీత గోవిందం’ లాంటి సినిమాలతో తెలుగులో మంచి పాపులారిటీ తెచ్చుకున్న కన్నడ యంగ్ హీరోయిన్ రష్మిక మందన్నా.. తన తొలి సినిమా ‘కిరిక్ పార్టీ’ హీరో రక్షిత్ శెట్టితో ఇంతకుముందు జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ‘గీత గోవిందం’లో విజయ్ దేవరకొండతో లిప్ లాక్ చేయడం.. అతడితో వ్యక్తిగతంగా కూడా సన్నిహితంగా మెలగడమే ఈ బ్రేకప్‌కు దారి తీసిందన్న ఊహాగానాలు వచ్చాయి. ఐతే తమ బ్రేకప్‌కు కారణాలేంటన్నది ఇటు రష్మిక కానీ.. అటు రక్షిత్ కానీ వెల్లడించలేదు. ఇలాంటి తరుణంలో మీడియాకు విజయ్ దొరికాడు. ‘నోటా’ ప్రమోషన్లకు వచ్చిన అతడిని.. ఆ బ్రేకప్‌కు కారణం మీరేనా అంటూ ప్రశ్నించారు మీడియా ప్రతినిధులు. దీనికతను హుందాగా స్పందించాడు.

‘‘రష్మితో నటించడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. నేను సినిమాల వరకే మాట్లాడతాను. నేను ఆమెకు కోస్టార్ మాత్రమే. తన వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లను. నేను మూడో వ్యక్తిని. వాళ్ల రిలేషన్‌షిప్ గురించి నన్ను స్పందించమనడం సరి కాదు. దాని గురించి వాళ్లే మాట్లాడాలి. అయినా అది వాళ్ల జీవితం. నేను దాని గురించి మాట్లాడితే  ఆ విషయాలు వారిని బాధిస్తాయి. వారిద్దరూ ఎంత బాధను అనుభవించారో నాకు వ్యక్తిగతంగా తెలుసు. వాళ్లు ఈ విషయాల నుంచి బయటపడేందుకు కాస్త సమయమివ్వండి’’ అని మీడియాకు విజయ్ విజ్ఞప్తి చేశాడు. ఇక రక్షిత్ గురించి విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశఆడు. అతను మంచి నటుడని.. రక్షిత్ కొత్త సినిమా ‘అవనే శ్రీమన్నారాయణ’ ఆసక్తి రేకెత్తిస్తోందని అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English