ఆ చిందులు ఉదయభానుతో...

ఆ చిందులు ఉదయభానుతో...

తన గ్లామర్‌తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన యాంకర్‌ అనసూయ, పవన్‌ కళ్యాణ్‌ సినిమాలో ఐటెం సాంగ్‌ చెయ్యమంటే చెయ్యనని చెప్పేసింది. అవరసమైతే పవన్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తాను కాని, నో ఐటెమ్స్‌ ప్లీజ్‌ అందట. మరి ఈ సందర్భంలో ఆ స్థానంలో ఎవ్వరిని తీసుకుంటే బాగుంటుంది అని చూస్తే, కరెక్ట్‌ ఆన్సర్‌ ఒక్కటేఒక్కటుంది.

గ్లామర్‌కు గ్లామర్‌, మటాలకు మాటలు, మతిపోగట్టే ఒంపులు, అదరొగొట్టే డ్యాన్సులు చెయ్యడమంటే ఉదయభాను తరువాతే ఎవరైనా. అందుకే పవన్‌ కళ్యాణ్‌ - త్రివిక్రమ్‌ సినిమాలో ఈమెతో ఆ ఐటెం సాంగుకు స్టెప్పులేయిచాలని మన దర్శకుడు డిసైడయ్యాడట. గతంలో అల్లు అర్జున్‌ జులాయ్‌ సినిమాలో ఉదయభాను ఏ రేంజ్‌లో రెచ్చిపోయిందే చూశాం.

అయితే ఆ పాటలో ఆమెకు లీడర్‌ సినిమాలో వచ్చినంతగా స్కోప్‌ ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ సరసన తనలోని వైల్డ్‌ కోణాన్ని చూపించడానికి సిద్దపడుతోందట మన భాను. ఇప్పటికీ ఈ యాంకర్‌ అంటే యువత పడిచచ్చిపోవడం మనకు తెలిసిందే. అందుకే ఈ సాంగ్‌ సినిమాకే ఒక రేంజ్‌ హైలైట్‌ అవుతుందని త్రివిక్రమ్‌ ఆశిస్తున్నాడని టాక్‌.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు