దిల్‌ రాజు బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయాలు?

దిల్‌ రాజు బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయాలు?

చేతిలో చాలా థియేటర్లు పెట్టుకుని మంచి సీజన్‌ వున్నపుడు, పండగల వేళ తన సినిమాలు తప్పకుండా విడుదలయ్యేలా చూసుకునే దిల్‌ రాజు ఈమధ్య ఎక్కువ పెత్తనం చేస్తున్నాడనే టాక్‌ బాగా వినిపిస్తోంది. తన సినిమాలకి పోటీగా వచ్చే చిత్రాలని తొక్కేయడానికి అతను బాగా ప్రయత్నిస్తున్నాడని, తన చిత్రాలకి పోటీగా వచ్చే చిత్రాలని వేరే డేట్‌కి వెళ్లేలా తన అధికారం వాడుతున్నాడని గుసగుసలున్నాయి. 'గీత గోవిందం' చిత్రానికి ముందు 'శ్రీనివాస కళ్యాణం' విడుదల చేసి, నైజాంలో మొదటి రోజున దానికి థియేటర్లు దొరక్కుండా అడ్డుకోవడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. తన సినిమాలో స్టఫ్‌ లేదని తెలిసి రెండవ రోజుకి సరండెర్‌ అయిపోయాడు కానీ గీత గోవిందం మొదటి రోజు రెవెన్యూకి గండి కొట్టడం మాత్రం ట్రేడ్‌లో హాట్‌ టాపిక్‌ అయింది.

ఇటీవల 'నోటా' చిత్రాన్ని దసరాకి విడుదల చేసుకుందామని చూస్తే అది అప్పుడు రాకుండా తన శక్తులన్నీ వాడేసి వారిని అక్టోబర్‌ 5కే పంపించేసాడు. తన చిత్రం హలోగురూ ప్రేమకోసమే దసరాకి వస్తుండడంతో, అదే రోజున రిలీజ్‌ ప్రకటించిన 'పందెంకోడి 2' చిత్రానికి కూడా దిల్‌ రాజు ఆటంకాలు కలిగిస్తున్నాడని, ఆ చిత్రాన్ని ఇక్కడ పంపిణీ చేస్తోన్న ఠాగూర్‌ మధుతో తనకున్న పాత లావాదేవీలు తవ్వి తీసి ఈ చిత్రానికి అడ్డుగా పెడుతున్నాడని బలమైన పుకార్లు వినిపిస్తున్నాయి. తన చేతిలో థియేటర్లు పెట్టుకుని ఇలా అజమాయిషీ చేస్తోన్న దిల్‌రాజుపై ఆగ్రహ జ్వాలలు పెరుగుతోన్న నేపథ్యంలో త్వరలోనే ఈ విషయం రచ్చకెక్కే అవకాశముందనే డిస్కషన్‌ జరుగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English