చెన్నైలో ‘గీత గోవిందం’ సంచలనం

చెన్నైలో ‘గీత గోవిందం’ సంచలనం

తమిళ సినిమాలు తెలుగు తెరపై దండెత్తడం.. వసూళ్ల మోత మోగించడమే చూస్తూ వచ్చాం చాలా ఏళ్ల పాటు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి మారింది. తెలుగు రాష్ట్రాల్లో తమిళ సినిమాల ప్రభావం తగ్గింది. అదే సమయంలో తమిళనాట మన సినిమాల హవా పెరిగింది. ‘బాహుబలి’ అక్కడ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే.

ఐతే అది ప్రత్యేకమైన సినిమా. అదొక విజువల్ వండర్. కాబట్టి ‘బాహుబలి’ అలా ఆడేయడంలో ఆశ్చర్యం లేదు. ఐతే ఇప్పుడు ‘గీత గోవిందం’ లాంటి మామూలు సినిమా సైతం తమిళనాట అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. తెలుగు సినిమాల్లో నాన్-బాహుబలి రికార్డుల్ని నెలకొల్పింది.

ఈ చిత్రం తమిళనాట 50 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది. చెన్నైలోని పదుల సంఖ్యలో మల్టీప్లెక్సులు ఈ చిత్రాన్ని 50 రోజుల పాటు ప్రదర్శించాయి. ‘బాహుబలి’ మినహా ఏ సినిమా కూడా ఇలా ఆడలేదు. ఫుల్ రన్లో ఈ చిత్రం అక్కడ రూ.6.2 కోట్ల గ్రాస్.. రూ.2.6 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం.

వేసవిలో ‘భరత్ అనే నేను’ నెలకొల్పిన నాన్-బాహుబలి వసూళ్ల రికార్డుల్ని ‘గీత గోవిందం’ బద్దలు కొట్టేసింది. ‘అర్జున్ రెడ్డి’తో విజయ్ దేవరకొండకు తమిళనాట సూపర్ ఫాలోయింగ్ రావడం ఈ చిత్రానికి బాగా కలిసొచ్చిందని భావిస్తున్నారు. ‘గీత గోవిందం’ సక్సెస్ ‘నోటా’కు మరింతగా కలిసొస్తుందనడంలో సందేహం లేదు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English