‘రోబో’ రిలీజ్ ఆపిన ఆ పక్షి

 ‘రోబో’ రిలీజ్ ఆపిన ఆ పక్షి

ఏడాది కిందటే దీపావళికి రావాల్సిన సినిమా ‘2.0’. కానీ వాయిదాల మీద వాయిదాలు పడి ఈ ఏడాది నవంబరు 29కి షెడ్యూల్ అయింది. గత ఏడాది నవంబరు నుంచి జనవరి.. ఆ తర్వాత ఏప్రిల్‌కు వాయిదా పడి.. చివరికి ఏడాది చివరికి వెళ్లింది. ఈ వాయిదాలకు కారణం విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో జాప్యమే కారణమన్నది తెలిసిన విషయమే.

ఐతే సరిగ్గా ఎక్కడ ఇబ్బంది వచ్చిందో.. ఏం జరిగిందో దర్శకుడు శంకర్ ప్రముఖ క్రిటిక్ రాజీవ్ మసంద్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘2.0’ టీజర్లో చాలా భయంకరంగా కనిపిస్తూ.. ఆ టీజర్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పక్షి వల్లే సినిమా వాయిదా పడిందని శంకర్ తెలిపాడు.

‘2.0’ మొత్తం బడ్జెట్లో మూడో వంతు విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఖర్చు పెట్టామని చెప్పిన శంకర్.. అందులో మేజర్ పార్ట్ టీజర్లో కనిపించిన పక్షి కోసమే వెచ్చించినట్లు చెప్పాడు. ఐతే ఈ పక్షి రూపం ముందు తాను అనుకున్న రీతిలో రాలేదన్నాడు.

తన విజువలైజేషన్‌కు తగ్గట్లుగా ఔట్ పుట్ రాకపోవడంతో తాను సంతృప్తి చెందలేదన్నాడు. ఈ కారణంతో కూడా సినిమా ఆలస్యమైందన్నాడు. అలాగే తాము ముందు ఒప్పందం కుదుర్చుకున్న వీఎఫెక్స్ సంస్థ అనుకున్న సమయానికి ఔట్ పుట్ డెలివరీ కూడా ఇవ్వలేదన్నాడు.

ఆ సంస్థ మళ్లీ మళ్లీ డెడ్ లైన్లు మార్చడంతో మార్వల్ స్టూడియోస్ తీసే సినిమాలకు వీఎఫెక్స్ సమకూర్చే సంస్థ దగ్గరికి వెళ్లామని.. ఇప్పుడు ఆ సంస్థే తమకు ఔట్ పుట్ ఇస్తోందని శంకర్ చెప్పాడు. వాళ్లు హామీ ఇచ్చాకే నవంబరు 29న రిలీజ్ డేట్ ఖరారు చేసినట్లు వెల్లడించాడు శంకర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English