ఆ దర్శకుడి 'గీత' మారిపోయింది

ఆ దర్శకుడి 'గీత' మారిపోయింది

'గీత గోవిందం'తో దర్శకుడిగా అతి పెద్ద విజయాన్ని అందుకున్న పరశురామ్‌కి ఇప్పుడు ఇండస్ట్రీలో భలే డిమాండ్‌ వుంది. మినిమమ్‌ గ్యారెంటీ దర్శకుడనే పేరు మొదట్నుంచీ వుండడంతో పరశురామ్‌తో పలు నిర్మాణ సంస్థలు ఎప్పుడో ఒప్పందాలు చేసుకుని వున్నాయి. కొందరయితే అడ్వాన్సులు ఇచ్చి ఎప్పుడు కథ వుంటే అప్పుడు రమ్మని కూడా చెప్పారు.

గీత గోవిందంకి ముందు కోటి రూపాయల లోపు పారితోషికం తీసుకునే దర్శకుడైన పరశురామ్‌కి ఈ చిత్రంతో పూర్తిగా గీత మారిపోయింది. ఆ చిత్రానికి పారితోషికం కాకుండా లాభాల్లో వాటా తీసుకోవడానికి అంగీకరించిన పరశురామ్‌కి దాని వలన జాక్‌పాటే తగిలింది. తన వాటాగా పది కోట్ల రూపాయలు వచ్చాయట. తన తదుపరి చిత్రాలకి ఈ స్థాయి పారితోషికం అప్పుడే ఇవ్వకపోయినా కానీ ఇప్పుడు పరశురామ్‌ రేంజ్‌ మూడు నుంచి అయిదు కోట్లు పలుకుతోందని, హీరోని బట్టి, ప్రాజెక్ట్‌ రేంజ్‌ని బట్టి ఈ అమౌంట్‌ డిసైడ్‌ అవుతుందని టాక్‌.

ఇంతకుముందు అతనితో ఒప్పందాలు చేసుకున్న వాళ్లు కూడా భారీ పారితోషికం ఆఫర్‌ చేస్తూ త్వరగా తమకో సినిమా చేసిపెట్టమని ఒత్తిడి చేస్తున్నారట. అయితే గీత గోవిందం విడుదల కాకముందే జిఏ 2 పిక్చర్స్‌కి మరో సినిమా చేస్తానని ఒప్పందం చేసుకోవడంతో ప్రస్తుతం ఆ కథని రెడీ చేసే పనిలో బిజీగా వున్నాడు పరశురామ్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English