అదే రాజమౌళికి, శంకర్‌కు తేడా

అదే రాజమౌళికి, శంకర్‌కు తేడా

దక్షిణాది సినిమాను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లిన దర్శకుల్లో శంకర్ ఒకడు. ఐతే అతను మొదట్నుంచి అద్భుతమైన సినిమాలే తీస్తూ వచ్చాడు. చాలా వేగంగా గొప్ప స్థాయికి ఎదిగాడు. రాజమౌళి సైతం ‘మగధీర’.. ‘ఈగ’.. ‘బాహుబలి’ లాంటి సినిమాలతో మన సినిమా స్థాయిని ఎంతో పెంచాడు. దేశవ్యాప్తంగా తిరుగులేని ఆదరణ సంపాదించుకున్నాడు. మొత్తం ఇండియన్ సినిమా ప్రమాణాల్నే మరో స్థాయికి తీసుకెళ్లిన ఘనత అతడి సొంతం. ఐతే శంకర్ లాగా కాకుండా రాజమౌళి నెమ్మదిగా అడుగులు వేశాడు. మొదట్లో మామూలు సినిమాలే తీసినా.. తర్వాత కొత్త విషయాలు నేర్చుకుంటూ భారీ కలలు కంటూ.. వాటిని నెరవేర్చుకుంటూ గొప్ప స్థాయిని అందుకున్నాడు. అటు శంకర్, ఇటు రాజమౌళి ఇద్దరూ కూడా ఎవరి స్థాయిలో వాళ్లు గొప్ప వాళ్లే. ఇద్దరూ వినమ్రంగా కనిపించేవాళ్లే.

కానీ ఇద్దరిలో ఒక ముఖ్యమైన తేడాను గమనించవచ్చు. రాజమౌళి దగ్గర ఎప్పుడు శంకర్ ప్రస్తావన ఎత్తినా సరే చాలా గొప్పగా మాట్లాడతాడు. ఆయన స్థాయే వేరు అంటాడు. సాంకేతికతను ఉపయోగించుకోవడంలో, విజువలైజేషన్‌లో శంకర్‌ ముందు తాను నిలవలేనని.. ఆయన చాలా ముందుంటాడని చాలా వినమ్రంగా అంగీకరిస్తాడు జక్కన్న. కానీ శంకర్ మాత్రం ఇందుకు భిన్నం. అతను ‘బాహుబలి’ గురించి.. రాజమౌళి గురించి మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడడు.
ఇప్పటిదాకా ‘బాహుబలి’ గురించి శంకర్ స్పందించిందే లేదు.

తమిళంలో వచ్చే చిన్న చిన్న సినిమాల గురించి.. అలాగే హిందీ చిత్రాల గురించి కూడా మాట్లాడతాడు కానీ.. ‘బాహుబలి’ ప్రస్తావన తేడు. తాజాగా రాజీవ్ మసంద్ ఇంటర్వ్యూలో రెండుసార్లు ఆయన ‘బాహుబలి’ ప్రస్తావన తెచ్చాడు. కానీ శంకర్ స్పందించలేదు. అక్కడి నుంచి టాపిక్ డైవర్ట్ చేశాడు. తన సినిమాల గురించే మాట్లాడాడు. తన ఆలోచనలు ఎలా ఉంటాయో.. ‘రోబో’ ద్వారా ఇండియన్ సినిమా స్థాయి ఎలా పెరిగిందో.. ‘2.0’తో ఏం జరగబోతోందో మాట్లాడాడు తప్పితే.. ‘బాహుబలి’ ప్రస్తావన తేలేదు. వేరే సినిమాలు చాలా వాటి గురించి మాట్లాడాడు కానీ.. ‘బాహుబలి’ని విస్మరించడంలో ఆంతర్యమేంటో? ఇక్కడే రాజమౌళికి, శంకర్‌కు తేడా స్పష్టంగా కనిపించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English