డిజాస్టర్లో ఉండాల్సిన పాట.. బ్లాక్‌బస్టర్లోకి వచ్చింది

డిజాస్టర్లో ఉండాల్సిన పాట.. బ్లాక్‌బస్టర్లోకి వచ్చింది

రెండు నెలలుగా తెలుగు రాష్ట్రాల్ని ఊపేస్తున్న పాట.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే. ‘గీత గోవిందం’లోని ఈ పాట రిలీజవ్వడం ఆలస్యం ఇన్‌స్టంట్‌ హిట్టయిపోయింది. యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగించింది. దక్షిణాదిన మరే పాట కూడా ఈ స్థాయిలో హిట్స్ దక్కించుకోలేదు. భాషా భేదం లేకుండా అందరూ ఈ పాటను ఆదరించారు.

కోట్లల్లో వ్యూస్.. లక్షల్లో లైక్స్ వచ్చాయి ఈ పాటకు. దీన్ని ఎడిటెడ్ వెర్షన్స్ పెట్టినా వ్యూస్ మోత మోగిపోతోంది. ఇంతగా హిట్టయిన ఈ పాట అసలు ఈ సినిమాలో ఉండాల్సింది కానే కాదట. సంగీత దర్శకుడు గోపీసుందర్ ఈ పాటను కంపోజ్ చేసింది వేరే సినిమాకట. ఆ సినిమా మరేదో కాదు.. ఆది పినిశెట్టి-తాప్సి జంటగా నటించిన ‘నీవెవరో’.

ఆ సినిమాకు ముందుగా సంగీత దర్శకుడిగా ఎంచుకున్నది గోపీనే. అతను ఈ సినిమా కోసం ‘ఇంకేం ఇంకేం కావాలే’ పాటను కంపోజ్ చేశాడట. ఐతే అనివార్య కారణాలతో ‘నీవెవరో’ నుంచి గోపీ తప్పుకున్నాడు. అచ్చు రాజమణి దీనికి సంగీత దర్శకుడయ్యాడు. అదే సమయంలో ‘గీత గోవిందం’కు పని చేసే అవకాశం రావడంతో ఆ సినిమా కోసం ఈ ట్యూన్ ఉపయోగించాడు.

‘గీత గోవిందం’కు మంచి హైప్ రావడం.. పైగా సరైన టైమింగ్‌లో ఈ పాట రిలీజవడం కలిసొచ్చింది. సినిమా వల్ల పాటకు.. పాట వల్ల సినిమాకు చాలా మేలు జరిగింది. ఒకవేళ ‘నీవెవరో’ సినిమాలో ఈ పాట ఉంటే ఇది ఇంతగా పాపులర్ అయ్యేదా అనేది సందేహమే. ఆ రకంగా ‘నీవెవరో’ నుంచి గోపీ తప్పుకోవడం అతడి మంచికే అయింది. ఎన్నో సినిమాలు చేస్తే రాని పేరు.. కేవలం ఈ ఒక్క పాటతో సంపాదించుకున్నాడు గోపీ. సౌత్ ఇండియన్ మ్యూజిక్ హిస్టరీలోనే ఈ పాట ప్రత్యేకంగా నిలిచిపోతుందంటే సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English