సైఫ్ కొడుకు ఆయాకి జీతమెంతో తెలుసా?

సైఫ్ కొడుకు ఆయాకి జీతమెంతో తెలుసా?

సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్లో పెద్ద హీరో.. సినిమాల్లో బిజీగా ఉన్నాడు. అతడి భార్య కరీనా కపూర్ కూడా స్టార్ హీరోయినే. ఆమె కూడా పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తోంది. మరి వారికి పుట్టిన మద్దుల కొడుకు తైమూర్ అలీ ఖాన్ సంగతేంటి? అందుకోసమే ఒక కేరింగ్ ఆయాని పెట్టారు. ఆమె పేరు సావిత్రి.

పుట్టి పుట్టడంతోనే స్టార్ అయిపోయిన తైమూర్.. సోషల్ మీడియాలో సూపర్ పాపులర్. అతడి ఆయాగా సావిత్రి కూడా మంచి పాపులారిటీనే సంపాదించింది. ఆమెను అందరూ ‘నానీ’ అంటారు. తైమూర్ తల్లిదండ్రులతో కలిసి ఎప్పుడు బయటికి వెళ్లినా వెంట సావిత్రి ఉంటుంది. ఇంట్లో కూడా అతడి ఆలనా పాలనా చూసేది ఆమె. తల్లిదండ్రులతో కంటే సావిత్రితోనే తైమూర్‌ ఎక్కువ సమయం గడుపుతుంటాడు.

సైఫ్ కుటుంబం విదేశాలకు వెళ్లినా కూడా వెంట సావిత్రి ఉండాల్సిందే. సావిత్రి కేర్ టేకర్ మాత్రమే కాదు.. నర్స్ కూడా కావడం గమనార్హం. మరి ప్రతి క్షణం తైమూర్‌ను కంటికి రెప్పలా చూసుకునే సావిత్రికి సైఫ్ కుటుంబం ఇస్తున్న జీతం ఎంతో తెలుసా? అక్షరాలా లక్షన్నర రూపాయలు. ఆమెకు వర్క్ టైమింగ్స్ కూడా ఉన్నాయి. అదనపు సమయం కేటాయిస్తే ఓటీ ఫీజు కూడా వస్తుంది. ఇంకా అదనపు బహుమతులు, బోనస్‌లు కూడా ఉంటాయి. తైమూర్‌ కేర్ టేకర్‌గా అప్పుడప్పడూ ఆమె ఉచితంగా విదేశీ పర్యటనలకు కూడా వెళ్తుంది.

ఈ విషయాలు తెలుసుకుని సావిత్రితో పోలిస్తే మన జీవితాలు ఎంత అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు వేస్తున్నారు. బయట హాస్పిటల్లో నర్సుగా చేస్తే ఎంత అనుభవమున్నప్పటికీ 50 వేలకు మించి సంపాదించే అవకాశం లేదు. కానీ సెలబ్రెటీ కుటుంబంలో కేర్ టేకర్‌గా ఉండటం ద్వారా దానికి మూడు రెట్లు సంపాదిస్తూ.. అదనపు సౌలభ్యాలు కూడా పొందుతోంది సావిత్రి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English