మెగా ప్రాజెక్టులో కూతురికి డైరెక్టర్ ఛాన్స్

మెగా ప్రాజెక్టులో కూతురికి డైరెక్టర్ ఛాన్స్

దక్షిణాది నుంచి వచ్చిన అత్యంత గొప్ప దర్శకుల్లో ప్రియదర్శన్ ఒకరు. వివిధ భాషల్లో ఆయన క్లాసిక్స్ తీశారు. ముఖ్యంగా సొంత భాష మలయాళంలో ప్రియదర్శన్ తీసిన సినిమాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మామూలుగా ఒక దర్శకుడు రెండు మూడు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో ఉంటే.. నెమ్మదిగా ఔట్ డేట్ అయిపోతుంటాడు. గొప్ప గొప్ప దర్శకులు కూడా ట్రెండుకు తగ్గట్లు మారలేక టచ్ కోల్పోయినవాళ్లే. కానీ మూడు దశాబ్దాల కిందటి నుంచి సినిమాలు తీస్తున్న ప్రియదర్శన్.. ఇప్పటికీ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. తన ఫేవరెట్ యాక్టర్.. ఆప్తమిత్రుడు మోహన్ లాల్‌తో రెండేళ్ల కిందట కూడా ‘ఒప్పం’ అనే మంచి సినిమా తీశాడు. ఇప్పుడాయన ఓ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాడు. అందులోనూ మోహన్ లాలే కథానాయకుడు.

16వ శతాబ్దానికి చెందిన నావికా యోధుడు మరాక్కర్ కథతో ప్రియదర్శన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. మలయాళ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో తన కూతురు కళ్యాణికి ఓ ప్రత్యేక పాత్ర ఇచ్చాడు ప్రియదర్శన్. కళ్యాణి తెలుగులో ‘హలో’ చిత్రంతో కథానాయికగా పరిచయమైన సంగతి తెలిసిందే. దాని తర్వాత శర్వానంద్-సుధీర్ వర్మ సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. సొంత భాషలో తండ్రి సినిమాతో ఆమె పరిచయం కాబోతుండటం విశేషమే. ఐతే ఇందులో ఆమెది పూర్తి స్థాయి పాత్ర కాదని సమాచారం. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా నటిస్తోంది. అలాగే మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ సైతం ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. ఇలా సినిమాలో ఆకర్షణలు చాలానే ఉన్నాయి. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ఒకేసారి పలు భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English