మణిరత్నమా మజాకా

మణిరత్నమా మజాకా

మణిరత్నం ఈమధ్య కాలంలో తీస్తోన్న సినిమాలు చూసి ఆయన క్రేజ్‌ పడిపోయిందని, ఇక ఆయన తీసే సినిమాలని జనం పట్టించుకోరని అనేసారు. ఆయన గత చిత్రం 'చెలియా' దారుణమైన పరాజయం చవిచూడడంతో మణిరత్నం మలి చిత్రానికి కనీసం ఓపెనింగ్స్‌ అయినా వస్తాయా అని కూడా కామెంట్స్‌ వేసారు.

ఎప్పటికప్పుడు వైవిధ్యం కోసం పరితపించే మణిరత్నం ఈసారి సోదరుల మధ్య జరిగే ఆధిపత్య పోరుని కథాంశంగా ఎంచుకుని 'నవాబ్‌' తీసారు. ఈ చిత్రం తమిళ వెర్షన్‌కి వున్న క్రేజ్‌ చూసి మణిరత్నంని కొట్టి పారేసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

గురువారం విడుదల కానున్న ఈ చిత్రానికి వున్న క్రేజ్‌తో ప్రీమియర్‌ షోలు, ఎర్లీ మార్నింగ్‌ షోలు అజిత్‌, విజయ్‌ సినిమాలతో సమానంగా వేస్తున్నారు. ఎన్ని షోలు అనౌన్స్‌ చేసినా అడ్వాన్స్‌లో టికెట్స్‌ సేల్‌ అయిపోతూ వుండడం చూసి ట్రేడ్‌ పండితులు కూడా అవాక్కవుతున్నారు. ఈ చిత్రంలో ప్రస్తుతం ట్రెండింగ్‌లో వున్న హీరోలు ఎవరూ నటించలేదు. అయినా కానీ మణిరత్నం పేరుపై వున్న నమ్మకంతో దీనికి అద్భుతమైన స్పందన వస్తోంది.

సినిమా రిజల్ట్‌ ఎలా వుంటుందనేది తర్వాత తెలుస్తుంది కానీ ప్రస్తుతానికి మణిరత్నం బ్రాండ్‌కి వున్న విలువ ఏమిటనేది ఆయనని కొట్టి పారేసిన వారికి చెంప మీద కొట్టినట్టుగా అర్థమవుతోంది. అయితే తెలుగు వెర్షన్‌ 'నవాబ్‌'కి మాత్రం అసలు క్రేజ్‌ లేదు. కనీసం దానిని సరిగా ప్రమోట్‌ కూడా చేయడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English