బాలీవుడ్ రీమేక్.. సమంత వెర్సస్ నిహారిక

బాలీవుడ్ రీమేక్.. సమంత వెర్సస్ నిహారిక

గత కొన్నేళ్లుగా దక్షిణాది సినిమాలు పెద్ద ఎత్తున హిందీలో రీమేక్ అవుతున్నాయి. అక్కడి కథలు ఇక్కడికి రావడమే తగ్గిపొయింది. అప్పుడప్పుడూ ఓ సినిమా మాత్రం తెలుగులోకి రీమేక్ అవుతోంది. ప్రస్తుతం అడివి శేష్, రాజశేఖర్ తనయురాలు శివాని జంటగా నటిస్తున్న ‘2 స్టేట్స్’ హిందీలో అదే పేరుతో హిట్టయిన చిత్రానికి రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

దీని తర్వాత ఒక లేటెస్ట్ సూపర్ హిట్ మూవీని తెలుగులో తీయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఆగస్టు నెలాఖర్లో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన సూపర్ హిట్టయిన ‘స్త్రీ’ని టాలీవుడ్లో ఒక నిర్మాత రీమేక్ చేయడానికి హక్కులు తీసుకున్నాడట. రూ.24 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ హార్రర్ కామెడీ మూవీ.. రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

రాజ్ కుమార్ రావు, శ్రద్ధ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అమర్ కౌశిక్ రూపొందించాడు. తెలుగు వాళ్లయిన రాజ్ నిడిమోరు, కృష్ణ.డి.కె ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఈ చిత్ర రీమేక్ హక్కులు తీసుకున్న ఓ నిర్మాత లీడ్ రోల్స్ కోసం నటీనటుల్ని వెతికే పనిలో ఉన్నారట. ఈ చిత్రంలో హీరో కంటే హీరోయిన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.

ఆ పాత్ర కోసం సమంత ప్రధాన పోటీదారుగా ఉన్నట్లు సమాచారం. ఐతే నిర్ణయం సమంత చేతుల్లోనే ఉంది. ఆమె ఒప్పుకోకుంటే మెగా ఫ్యామిలీ అమ్మాయి కొణిదెల నిహారికను ఎంచుకుంటారట. ఐతే ఈ సినిమాకు న్యాయం జరగాలంటే.. సినిమాకు క్రేజ్ రావాలంటే సమంతే కరెక్ట్ అంటున్నారు. ఇటీవలే సమంత నటించిన తొలి లేడీ ఓరియంటెడ్ మూవీ ‘యూ టర్న్’ సూపర్ హిట్టయింది.

ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించగల స్టార్ డమ్ ఆమె సొంతం. నిహారిక ఇంకా కెరీర్లో తొలి అడుగులు వేస్తోంది. ఆమె ఇంకా ఒక్క విజయం కూడా అందుకోలేదు. కాబట్టి సమంత కోసమే నిర్మాత గట్టిగా ప్రయత్నిస్తున్నాడట. ఆమె నో అంటే నిహారికను ఎంచుకుంటారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English