అంబానీ కుమార్తె ఎంగేజ్ మెంట్ తొలిరోజు ఫోటోలొచ్చాయ్‌!

అంబానీ కుమార్తె ఎంగేజ్ మెంట్ తొలిరోజు ఫోటోలొచ్చాయ్‌!

భార‌త‌దేశ కుబేరుడు.. ప్ర‌పంచ సంప‌న్నుల్లో ఒక‌డైన రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గారాల‌ప‌ట్టి ఈశా అంబానీ పెళ్లి వేడుక‌కు సంబంధించి ఎంగేజ్ మెంట్ భారీగా సాగింది. పెళ్లిని మూడు రోజులు.. ఐదు రోజులంటూ హ‌డావుడి మామూలే. అంద‌రిలా ఎంగేజ్ మెంట్ చేసుకుంటే అంబానీల స్పెష‌ల్ ఏముంటుంది?  అందుకే.. ఈశా ఎంగేజ్ మెంట్ ను ఏకంగా మూడు రోజుల వేడుక‌గా ప్లాన్ చేశారు.

పిరిమాల్ గ్రూప్స్ వార‌సుడైన ఆనంద్ పిరమాల్ ను ఈశా పెళ్లాడ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఎంగేజ్ మెంట్ కార్య‌క్ర‌మం ఇట‌లీలోని ప్ర‌ఖ్యాత కోమ్ స‌ర‌స్సు ద‌గ్గ‌ర ఉన్న ప్యాలెస్ లో నిర్వ‌హిస్తున్నారు. డెస్టినేష‌న్ వెడ్డింగ్ లో భాగంగా.. డెస్టినేష‌న్ అండ్  థీమ్ బేస్డ్ గా.. తాజా నిశ్చితార్థాన్ని నిర్వ‌హిస్తున్నారు.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ 21 నుంచి మూడు రోజుల పాటు ఎంగేజ్ మెంట్ కార్య‌క్ర‌మాలు ఉంటాయ‌ని తెలుస్తోంది. ఇందులో భాగంగా వీరిద్ద‌రూ ఉంగ‌రాలు మార్చుకోనున్నట్లు స‌మాచారం.  ఎంగేజ్ మెంట్ వేడుక కోసం ఇప్ప‌టికే ప‌లువురు పారిశ్రామిక ప్ర‌ముఖులు.. సినీ ప్ర‌ముఖులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన‌ట్లుగా చెబుతున్నారు.

ఈ వేడుక కోసం ఈశా అంబానీ ప్ర‌త్యేకంగా డిజైన్ చేసిన బేబీ పింక్ గౌన్ లో మెరిసిపోయారు. ఈ వేడుక ఫోటోల్ని ముకేశ్ అంబానీ స‌తీమ‌ణి నీతా అంబానీ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌టంతో.. ఈ వేడుక ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లైంది. ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్న ఈ ఫోటోలు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి.

ఇట‌లీలో అత్యంత విలాస‌వంత‌మైన వేడుకల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా చెప్పే కోమ్ లేక్ ఒడ్డున ఉన్న ఈ ప్యాలెస్ లో స‌క‌ల సౌక‌ర్యాల‌కు నెల‌వుగా చెబుతారు.అలాంటి ప్యాలెస్ లో గ్రాండ్ గా నిర్వ‌హించిన ఈ వేడుక సంప‌న్న వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వేడుక సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన భారీ టెక్నాల‌జీ సెక్యురిటీ సిస్ట‌మ్ ఈ కార్య‌క్ర‌మానికే హైలెట్ అని చెబుతున్నారు. ఈ ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన విందు ఒక్కొక్క‌రికి రూ.ల‌క్ష‌ల్లో ఉంటున్న‌ట్లు చెబుతున్నారు. అంబానీ ఇంత పెళ్లి సంద‌డా.. మ‌జాకానా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English