ఫాన్స్‌ ఫీడ్‌బ్యాక్‌... 'అరవింద'లో ఇంకోటి!

ఫాన్స్‌ ఫీడ్‌బ్యాక్‌... 'అరవింద'లో ఇంకోటి!

'అరవింద సమేత' ఆడియోలో రెండు మాత్రమే పాటల్లా వుండడం, మరో రెండు బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్స్‌లా వుండడంతో తారక్‌ సినిమాలో రెండే పాటలేంటని ఫాన్స్‌ గుస్సా అవుతున్నారు. సంగీత దర్శకుడు తమన్‌ని సోషల్‌ మీడియాలో ఇలా చేసారేంటి అంటూ నిలదీస్తున్నారు. ఫాన్స్‌ నుంచి ఈ రియాక్షన్‌ని యూనిట్‌ ముందే ఊహించినా కానీ మరో పాట తీయడానికి తగినంత సమయం లేదని నాలుగుతో సరిపెట్టారట.

అయితే నెగెటివ్‌ రియాక్షన్‌ తీవ్రంగా వుండడంతో మరో పాట కూడా జోడించాలని భావిస్తున్నారట. అవసరమైతే విడుదల ఒక రోజు వెనక్కి జరిపి అయినా ఆ పాటని యాడ్‌ చేస్తే బెస్ట్‌ అని చిత్ర బృందం ఆలోచిస్తోందని, తమన్‌ అయితే మరో పాటకి ట్యూన్‌ కూడా ముందే ఇచ్చేసాడని సమాచారం. కానీ పాట యాడ్‌ చేసినట్టయితే రన్‌ టైమ్‌ పెరిగి సీన్లు కుదించాల్సి వస్తుందని త్రివిక్రమ్‌ అనుమానం వ్యక్తం చేసాడట. ఈ చిత్రంలో కంటెంట్‌ చాలా స్ట్రాంగ్‌గా వుంటుంది కనుక పాటలు లేకపోయినా ఎవరూ కంప్లయింట్‌ చేయరనేది అతని నమ్మకమట.

ఇదే నమ్మకంతో నాలుగు పాటలతోనే ఆడియో సరిపెట్టేసారు. కానీ విడుదలకి ముందే ఫాన్స్‌ నిరాశ పడిపోతే అది ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపిస్తుందనే భయంతో ఆ పాటని జోడించాలని కృషి చేస్తున్నారని తెలిసింది. దీనికి సంబంధించిన అఫీషియల్‌ ఇన్‌ఫర్మేషన్‌ వచ్చే వారంలోగా తెలుస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English