పదమూడేళ్లుగా హిట్‌ లేని హీరో

పదమూడేళ్లుగా హిట్‌ లేని హీరో

నటుడిగా తొలినాళ్లలో కష్టాలు పడిన విక్రమ్‌ ఆ తర్వాత వైవిధ్యభరిత చిత్రాలతో తమిళనాట స్టార్‌ అయ్యాడు. అనువాద చిత్రాలైన శివపుత్రుడు, అపరిచితుడుతో విక్రమ్‌ తెలుగునాట కూడా పాపులర్‌ అయ్యాడు. అయితే అపరిచితుడు తర్వాత మళ్లీ విక్రమ్‌కి ఈ పదమూడేళ్లలో సరయిన హిట్‌ లేదు. చివరకు శంకర్‌ కూడా 'ఐ'తో అతనికి సక్సెస్‌ ఇవ్వలేకపోయాడు.

ఈ పదమూడేళ్లలో యావరేజ్‌గా ఆడిన నాన్న, ఐ చిత్రాలని మినహాయిస్తే విక్రమ్‌ సినిమాలన్నీ ఫ్లాపే. ఈమధ్య అయితే అతను నటించిన చిత్రాలని ప్రేక్షకులు నిర్దయగా తోసిపుచ్చుతున్నారు. అతని గత చిత్రం స్కెచ్‌కి పోస్టర్‌ ఖర్చులు కూడా రాలేదు. తాజాగా 'సామి స్క్వేర్‌'తో వచ్చిన విక్రమ్‌ కథల ఎంపికలో ఎలాంటి పొజిషన్‌లో వున్నాడో చాటుకున్నాడు.

అతి హీనంగా వున్న ఈ చిత్రంలో విక్రమ్‌ హీరోగా నటించడమేంటని అభిమానులు తల పట్టుకుంటున్నారు. యాభై రెండేళ్ల వయసులో విక్రమ్‌ మునుపటి గ్లామర్‌ కూడా కోల్పోయాడు. 'సామి'లో అతను చాలా వయసు మళ్లిన వాడిలా కనిపించాడు. ఎంతగా బాడీ బిగించి ఫైట్లు చేయాలని చూసినా కానీ వయసు మాత్రం దాచలేకపోయాడు.

కీర్తి సురేష్‌ పక్కన విక్రమ్‌ చాలా పెద్దవాడిలా అనిపించాడు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ విక్రమ్‌ బౌన్స్‌ బ్యాక్‌ అవుతాడనేది కూడా అనుమానంగానే కనిపిస్తోంది. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో చేస్తోన్న ధృవ నచ్చిత్రమ్‌ చిత్రంతో అయినా అతనికి మళ్లీ మంచి రోజులు వస్తాయేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English