మహేష్ అండ లేకుండా కొట్టాలని..

మహేష్ అండ లేకుండా కొట్టాలని..

హీరో సుధీర్ బాబు తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకోవాలని బాగానే కష్టపడుతున్నాడు. కానీ ఇప్పటికీ అతడిని మహేష్ బాబు బావగానే గుర్తిస్తున్నారు జనాలు. తన ప్రతి సినిమాకూ మహేష్ బాబు సపోర్ట్ తీసుకోవడం.. ఆడియో వేడుకలకు ముఖ్య అతిథిగా పిలవడం.. మహేష్ అభిమానుల గురించి తరచుగా మాట్లాడుతూ వాళ్ల మద్దతు కోసం ప్రయత్నించడం చూస్తూనే వస్తున్నాం. సుధీర్ చివరి సినిమా ‘సమ్మోహనం’కు కూడా మహేష్ సపోర్ట్ ఇచ్చాడు. ఆడియో వేడుకకు వచ్చాడు. సినిమా చూసి సోషల్ మీడియా ద్వారా దాన్ని ప్రమోట్ చేశాడు. ఐతే ఆ సినిమా విజయం సుధీర్‌లో కొంచెం ఆత్మవిశ్వాసం పెంచినట్లే ఉంది. ఇక తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని.. తన కాళ్లపై తాను నిలవాలని సుధీర్ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.

తన పేరుతో సొంతంగా బేనర్ పెట్టి ‘నన్ను దోచుకుందువటే’ సినిమా తీశాడు సుధీర్. ఈ చిత్రంతో ఒక కొత్త దర్శకుడిని పరిచయం చేసే సాహసం కూడా చేశాడు. ఈ సినిమాకు స్క్రిప్టు ఎంపిక దగ్గర్నుంచి నిర్మాణ వ్యవహారాల వరకు అన్ని తానే చూసుకున్నాడు సుధీర్. ఇప్పుడు ఈ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ మహేష్ బాబు లేకుండానే చేశాడు. మహేష్‌కు ఖాళీ లేకపోవడం వల్లే రాలేదని అన్నాడు కానీ.. నిజానికి సుధీర్ పిలిస్తే మహేష్ కచ్చితంగా ఖాళీ చేసుకుని వచ్చేవాడు. కానీ సుధీర్ ఈసారి బావమరిది సపోర్ట్ లేకుండా హిట్ కొట్టాలని.. తనేంటో రుజువు చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడని.. అందుకే మహేష్ బాబును మొహమాట పెట్టలేదని సన్నిహితులు చెబుతున్నారు.  ఈ సినిమా ఫలితం విషయంలో సుధీర్ చాలా కాన్ఫిడెంటుగా ఉన్నాడట. కచ్చితంగా సక్సెస్ సాధించి తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుని.. ఇక తనకు మహేష్ సపోర్ట్ అవసరం లేదని చాటి చెప్పాలని భావిస్తున్నాడట సుధీర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English