నా డబ్బులిచ్చాకే ‘నోటా’ రిలీజ్ చేయండి

నా డబ్బులిచ్చాకే ‘నోటా’ రిలీజ్ చేయండి

విజయ్ దేవరకొండ సినిమా అంటే విడుదలకు ముందు ఏదో ఒక వివాదం ఉండాల్సిందేనేమో. పోయినేడాది ‘అర్జున్ రెడ్డి’ రిలీజ్ ముంగిట ఎన్ని వివాదాలు చెలరేగాయో తెలిసిందే. ఈ ఏడాది గత నెలలో ‘గీత గోవిందం’ పైరసీ బారిన పడటం వివాదాస్పదమైంది.

ఇప్పుడు విజయ్ కొత్త సినిమా ‘నోటా’ విషయంలోనూ ఒక కాంట్రవర్శీ నడుస్తోంది. ఈ చిత్రానికి మాటలు రాసిన శశాంక్ వెన్నెలకంటి తనకు అన్యాయం జరిగిందంటూ మీడియా ముందుకొచ్చాడు. ‘నోటా’ తెలుగు వెర్షన్ కోసం తనతో చిత్ర దర్శకుడు ఆనంద్ శంకర్ మాటలు రాయించుకున్నాడని.. కానీ ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్లో తనకు మాటల రచయితగా క్రెడిట్ ఇవ్వలేదని శశాంక్ ఆరోపిస్తున్నాడు.

కథ, స్క్రీన్ ప్లేతో పాటు మాటల క్రెడిట్ కూడా ఆనంద్ శంకరే వేసుకున్నాడని.. ఐతే ట్రైలర్లో వినిపించిన డైలాగులు తాను రాసినవే అని శశాంక్ అన్నాడు. తనతో చేయించుకున్న పనికి డబ్బులతో పాటు క్రెడిట్ కూడా ఇవ్వాలని.. ఇవి రెండూ జరగకుండా సినిమా విడుదల కాకుండా చూాడాలని శశాంక్ అన్నాడు.

ఈ విషయమై అతను చిత్ర నిర్మాత జ్ఞానవేల్‌ రాజాపై చెన్నై పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. మరి ఈ వివాదంపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి. తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ తమిళ డబ్బింగ్ సినిమాల రచనలో శశాంక్ కీలకంగా మారాడు.

తమిళం నుంచి తెలుగులోకి వచ్చే ప్రతి పెద్ద సినిమాకూ అతనే మాటలు రాస్తుంటాడు. మరి ‘నోటా’ విషయంలో అతడికి, దర్శకుడికి ఎక్కడ తేడా కొట్టిందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English