‘మహానటి’కి 16 అనుకుంటే 29 అయింది

 ‘మహానటి’కి 16 అనుకుంటే 29 అయింది

‘మహానటి’ సినిమా వైజయంతీ మూవీస్ సంస్థ చరిత్రలోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఆ మాటకొస్తే తెలుగు సినిమా చరిత్రలోనూ దీనికి ప్రత్యేక స్థానం దక్కింది. ఐతే సావిత్రి కథతో సినిమా అన్నపుడు జనాల్లో ఏమంత ఆసక్తి కనిపించలేదు.

ఎప్పుడో ముగిసిన సావిత్రి చరిత్రను ఇప్పుడు సినిమాగా తీస్తే ఎవరు చూస్తారని... ఇలాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఆదరణ ఉండదని వ్యతిరేక వ్యాఖ్యలే వినిపించాయి. ఐతే ఇలాంటి మాటలేమీ పట్టించుకోకుండా భారీ బడ్జెట్లో ఈ సినిమాను తీర్చిదిద్దింది వైజయంతీ మూవీస్. ఐతే ఈ సినిమాపై అంత బడ్జెట్ పెట్టే ధైర్యం తమకెలా వచ్చిందో ఆశ్చర్యం కలిగించే విషయమే అంటున్నాడు నిర్మాత అశ్వినీదత్.

‘మహానటి’కి ముందు అనుకున్న బడ్జెట్ వేరని.. అయిన బడ్జెట్ వేరని ఆయనన్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. నేను మా అమ్మాయి స్వ‌ప్న‌ని ‘మహానటి’ మొదలవుతున్నపుడు సినిమాకు ఎంత ఖర్చవుతుంద‌ని అడిగా. రూ.16-17 కోట్ల‌వుతుంద‌ని చెప్పింది ఈ చిత్రానికి ఆ బడ్జెటే ఎక్కువనుకున్నా. అయినా సావిత్రి సినిమా కాబట్టి ఫ‌ర్వాలేదనుకున్నా. గ్రాఫిక్స్ ద‌గ్గ‌ర, సెట్స్ ద‌గ్గ‌ర రాజీ పడొద్దు అని చెప్పా. ఆఖ‌రికి ఖర్చు రూ.29 కోట్ల‌యింది.

కానీ సినిమా క్వాలిటీ చూసినప్పుడు అంత బడ్జెట్ పెట్టడం తప్పేమీ కాదనిపించింది. ఇలాంటపుడు  ఏమీ చేయ‌లేం. సావిత్రిగారి క‌థ‌ను చెప్ప‌డం ప్రతిష్టాత్మకం అనుకుని చేశాం. ఆ సినిమా తీసినందుకు ప్ర‌తి ఒక్క‌రికీ చాలా గొప్ప‌గా అనిపించింది. సినిమాకు మంచి ఫలితం కూడా రావడం సంతోషం’’ అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English