డేట్స్ లేవ‌ని తండ్రి మూవీకి నో చెప్పింద‌ట‌!

డేట్స్ లేవ‌ని తండ్రి మూవీకి నో చెప్పింద‌ట‌!

కొన్ని వార్త‌లు భ‌లే ఎట‌కారంగా ఉంటాయి. హైప్ క్రియేట్ చేయ‌టానికి అందంగా రాసే వార్త‌ల్ని య‌థాత‌ధంగా అచ్చేసుకునే తీరు ఒక అల‌వాటైతే.. సినిమా తార‌ల‌కు సంబంధించి నెగిటివ్ వార్త‌లు రాయ‌టానికి చేతులు రాని సినిమా జ‌ర్న‌లిస్టులు బోలెడంత‌మంది క‌నిపిస్తారు. ప్ర‌తిదాన్లోనూ విమ‌ర్శ కోణాన్ని ఎత్తి చూపించాల్సిన అవ‌స‌రంఉందంటారా? అంటూ నీతులు చెప్పే స‌ద‌రు పెద్ద మ‌నుషులు.. తాము క్రియేట్ చేసే హైప్ తో ప్ర‌జ‌లు ప‌క్క‌దారి ప‌డ‌తార‌న్న విష‌యాన్ని అస్స‌లు ప‌ట్టించుకోరు.

ఇప్పుడు అలాంటి హైపే క్రియేట్ అవుతోంది స్వర్గీయ శ్రీ‌దేవి కుమార్తె జాన్వీ క‌పూర్ ఇష్యూలో. ఆమె న‌టించిన థ‌డ‌క్ మూవీ పాజిటివ్ రిజ‌ల్ట్ వ‌చ్చిందే త‌ప్పించి.. స‌న్సేష‌న‌ల్ హిట్ మాత్రం కాలేద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు ఆ మూవీ త‌ర్వాత ఆమె చేస్తున్న‌ది ఒక మ‌ల్టీస్టార‌ర్ మూవీ. ఇది కాకుండా మ‌రో ప్ర‌ముఖ బ్యాన‌ర్ లో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు చెప్పినా.. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఇప్ప‌టివ‌ర‌కూ వెలువ‌డ‌లేదు.

అంటే.. జాన్వీ చేతిలో ప్ర‌స్తుతం ఒక్క సినిమానే ఉంద‌న్న మాట‌. కానీ.. అమ్మ‌డి డేట్స్ మాత్రం ఖాళీ లేవ‌ట‌. అది కూడా ఎవ‌రికో కాదు.. త‌న తండ్రి బోనీక‌పూర్ నిర్మించే మూవీకి అన్న విష‌యాన్ని భారీగా ప్ర‌చారం చేస్తున్నారు. చేసే ఒక సినిమానేఅయినా.. భారీ బిల్డ‌ప్ ఇవ్వ‌టంలో జాన్వీ పీఆర్ చాలానే తెలివిని ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లు చెప్పాలి. ఈ ఎపిసోడ్‌లో మ‌రో చిత్ర‌మైన అంశం ఏమంటే.. ఒక సినిమా జాన్వీ.. త‌న డేట్స్ లేవ‌ని త‌న డాడీకి చెప్పింద‌ని.. అందుకు తండ్రి బోనీక‌పూర్ తెగ సంతోష‌ప‌డిపోతూ.. త‌న కుమార్తె సొంత నిర్ణ‌యాలు తీసుకుంటున్నందుకుచాలా హ్యాపీగా ఉన్న‌ట్లు సెల‌విచ్చిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. వినే వాళ్లు ఉండాలే కానీ చెప్పే వాళ్లు చెల‌రేగిపోతారంటే ఇదేనేమో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English