కమ్ములకు నిర్మాత దొరికాడు

కమ్ములకు నిర్మాత దొరికాడు

‘అనామిక’ సినిమా తర్వాత రెండు మూడేళ్ల పాటు అడ్రస్ లేకుండా పోయిన శేఖర్ కమ్ముల గత ఏడాది ‘ఫిదా’తో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఊహించని విజయాన్నందుకుంది. దాదాపు 50 కోట్ల షేర్ వసూలు చేసి సంచలనం రేపింది. ఐతే ఇంతటి భారీ విజయం తర్వాత కమ్ముల ఏమీ తొందర పడలేదు. అతడితో పని చేయడానికి పెద్ద రేంజ్ హీరోలు ఆసక్తి చూపినా వాళ్ల వైపు చూడలేదు. మళ్లీ తన పాత స్టయిల్లో కొత్త వాళ్లతో సినిమా చేయడానికే నిర్ణయించుకున్నాడు. ఆ సినిమా కోసం బాగా టైం తీసుకుని స్క్రిప్టు రెడీ చేసుకున్నాడు. ఎట్లకేలకు అతడి కొత్త సినిమా ఆరంభం కాబోతోంది.

స్క్రిప్టు పూర్తయ్యాక నటీనటుల ఎంపిక కోసం ఆడిషన్స్ చేస్తూ వస్తున్న కమ్ముల ఆ పని పూర్తి చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ఓ కొత్త నిర్మాత ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. అతడికి ప్రొడక్షన్ కొత్తే కానీ.. ఇండస్ట్రీలో మాత్రం బడా బాబే. ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నాడట. నైజాం ఏరియాలో భారీగా థియేటర్లను నడుపుతున్న సునీల్.. డిస్ట్రిబ్యూషన్ కూడా పెద్ద రేంజిలోనే చేస్తున్నాడు. మహేష్ బాబుతో కలిసి ఆయన కొన్ని మల్టీప్లెక్సులు కూడా కడుతున్నాడు. మహేష్ బాబుతో ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ తీయబోయే సినిమాకు కూడా సునీలే నిర్మాత అంటున్నారు. దాని కంటే ముందు కమ్ముల సినిమాతో సునీల్ నిర్మాతగా పరిచయం అవుతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English