చిరంజీవి వెయిట్‌ ఇష్యూస్‌!

చిరంజీవి వెయిట్‌ ఇష్యూస్‌!

ఆమధ్య డైటింగ్‌, వ్యాయామం చేసి చాలా కిలోల బరువు తగ్గిన చిరంజీవి మళ్లీ ఇప్పుడు బరువు పెరిగిపోయారు. షోల్డర్‌ సర్జరీ అనంతరం చిరంజీవి మళ్లీ బరువు పెరుగుతూ వచ్చారట. సర్జరీ కారణంగా ఎక్సర్‌సైజ్‌కి దూరంగా వుండడం వల్ల బరువు పెరిగిపోయారట. దీని వల్ల సైరాలో కొన్ని సన్నివేశాలు తీయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ముఖ్యంగా చిరంజీవిని యంగ్‌గా చూపించే సన్నివేశాలు ఆశించిన విధంగా రావడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

చిరంజీవి బరువు తగ్గుతారనే ఉద్దేశంతో ముందుగా ఓల్డ్‌ గెటప్‌ సీన్స్‌ తీసేసారట. అయితే ఇప్పటికీ చిరంజీవి వెయిట్‌ ఇష్యూస్‌ ఒక కొలిక్కి రాలేదని, షూటింగ్‌కి విరామం ఇచ్చే అవకాశం లేదు కనుక ఇలాగే షూటింగ్‌ చేసేసి 'బాహుబలి'లో అనుష్కకి వాడిన మాదిరిగా అవసరమైన చోట్ల గ్రాఫిక్స్‌ సాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. అరవై మూడేళ్ల వయసులో బాడీ మెటాబాలిజం వల్ల అందరూ కోరుకున్న విధంగా బరువుని కంట్రోల్‌లో వుంచుకోలేరు. అందులోను సర్జరీలు జరిగితే సరేసరి. ఏది ఏమైనా చిరంజీవిని ఇంకా యంగ్‌గా చూపించాల్సిన సిట్యువేషన్స్‌ ఎదురైనపుడు దర్శకులు, ఛాయాగ్రాహకులు ఛాలెంజ్‌ ఫేస్‌ చేయాల్సి వస్తున్నట్టుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English