అఖిల్‌ 3కి ఆ మిస్టేక్‌ చేయట్లేదు

అఖిల్‌ 3కి ఆ మిస్టేక్‌ చేయట్లేదు

అఖిల్‌ గత చిత్రం 'హలో' విషయంలో నాగార్జున ప్రెస్టీజ్‌కి పోయి, రిస్క్‌ అని తెలిసినా 'ఎంసిఏ' చిత్రాన్ని ఢీకొన్నారు. హలో బాగానే వుందనే టాక్‌ వచ్చినా కానీ నాని-సాయిపల్లవి కాంబినేషన్‌ ముందు నిలబడలేకపోవడంతో నాగ్‌ ఆ చిత్రంతో బాగా నష్టపోయారు. నాగార్జునకి వచ్చిన నష్టం కంటే కూడా హీరోగా అఖిల్‌కి ఎదురైన పరాభవమే అభిమానుల్ని కలచి వేసింది.

అందుకే ఈసారి అఖిల్‌ 3 విషయంలో అలా రిలీజ్‌ పరమైన ప్లానింగ్‌ దెబ్బ తినకుండా చూసుకుంటున్నారు. అఖిల్‌ నటిస్తోన్న మూడవ చిత్రాన్ని ముందుగా డిసెంబర్‌ 21న విడుదల చేయాలని భావించారు. అయితే ఆ డేట్‌కి చాలా సినిమాలు వుండడంతో దీనిని వాయిదా వేసారు. సంక్రాంతికి కూడా రద్దీ ఎక్కువే వుంది కనుక వాటితోను క్లాష్‌ అవకుండా రిపబ్లిక్‌ డే రిలీజ్‌ ప్లాన్‌ చేసారు. పటాస్‌, భాగమతి లాంటి చిత్రాలు ఆ టైమ్‌లోనే రిలీజ్‌ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్లానింగ్‌ పరంగా ఇది మంచి ఐడియానే కానీ ఈలోగా మరే సినిమాలూ దీనికి పోటీ రాకూడదని ఫాన్స్‌ కోరుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English