బన్నీకి ఉదయం సర్జరీ.. సాయంత్రం షాపింగ్

బన్నీకి ఉదయం సర్జరీ.. సాయంత్రం షాపింగ్

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కమిట్మెంట్ గురించి.. అతను పడే కష్టం గురించి చాలామంది చాలా ఉదాహరణలు చెప్పారు. తాజాగా అతడి ఆప్త మిత్రుడు బన్నీ వాసు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బన్నీ కమిట్మెంట్ గురించి ఒక ఆసక్తికర సంగతి వెల్లడించాడు.

బన్నీ కెరీర్‌ను మలుపు తిప్పిన ‘ఆర్య’ సినిమా షూటింగ్ మొదలు కావడానికి ముందు చెన్నైలో ఒక రోజు ఉదయం బన్నీ టాన్సిల్స్ సర్జరీ చేసుకున్నాడట. ఐతే సర్జరీ అయ్యాక రెస్ట్ తీసుకోకుండా.. సాయంత్రానికల్లా బెంగళూరుకు వెళ్దాం బయల్దేరు అని బన్నీ వాసుతో అన్నాడట.

ఎందుకు అంటే.. ‘ఆర్య’ సినిమా కోసం కాస్ట్యూమ్స్ సెలక్ట్ చేసుకుందాం అన్నాడట. షూటింగుకి తక్కువ సమయం ఉండటంతో ఆ పని పూర్తి చేద్దామని తనను బలవంతం చేసి బెంగళూరుకు తీసుకెళ్లినట్లు బన్నీ వాసు చెప్పాడు.
ఇంట్లో ఒక మాట చెబుదాం అన్నా కూడా వినకుండా తనను బెంగళూరుకు తీసుకెళ్లాడని.. బన్నీలో సినిమా పట్ల అంతటి కుతూహలం, తపన ఉంటాయని.. ఈ సినిమా తర్వాత బన్నీ స్టార్ అయినా కూడా కమిట్మెంట్లో మార్పు లేదని.. ప్రతి సినిమా తొలి సినిమా లాగే భావించి కష్టపడతాడని.. ఇప్పటికీ ఆ లక్షణాన్ని విడిచి పెట్టలేదని బన్నీ వాసు చెప్పాడు.

నిజానికి తాను, బన్నీ ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినప్పటికీ.. తమ ఇద్దరి ఆలోచనలుచాలా భిన్నంగా ఉంటాయని వాసు తెలిపాడు. బన్నీ ఏదేమైనా దూకేద్దాం అనుకునే తరహా అని.. తాను ఆచితూచి అడుగులు వేస్తానని.. ఒకరికి నచ్చేది ఇంకొకరికి నచ్చదని.. అయినా కూడా ఒకరి అభిప్రాయాల్ని మరకొరు గౌరవించుకుంటామని చెప్పాడు. తాను ఏవైనా తప్పులు చేస్తే అల్లు అరవింద్ కోప్పడతారని.. కానీ బన్నీ మాత్రం ఎప్పుడూ తనను ఒక్క మాట కూడా అనడని.. తానంటే అతడికి అంత ఇష్టమని అన్నాడు వాసు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English