మహేష్‌పై కామెంట్స్.. పెద్ద గొడవే

మహేష్‌పై కామెంట్స్.. పెద్ద గొడవే

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుపై తమిళ స్టాండప్ కమెడియన్ మనోజ్ ప్రభాకరన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ వ్యాఖ్యలపై విషయంలో తీవ్రంగానే స్పందిస్తున్నారు. ఇండస్ట్రీ జనాలు సైతం ఈ కామెంట్స్ చూసి మండిపోతున్నారు. ఈ సెగ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు కూడా తాకింది. మహేష్ టాలీవుడ్లో ఇప్పుడు అగ్ర నటుడు కావడం.. అతను వివాదాలకు పూర్తి దూరంగా ఉండే తరహా కావడంతో ఈ సమయంలో స్పందించక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో తమిళ నడిగర్ సంఘానికి ‘మా’ తరఫున లేఖ రాశారు. మహేష్ లాంటి పెద్ద హీరో.. మంచి నటుడిపై ఈ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని.. ఈ విషయంలో వెంటనే నడిగర్ సంఘం చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో రాశారు.


తమిళ.. తెలుగు సినీ పరిశ్రమల మధ్య దశాబ్దాలుగా మంచి సంబంధాలున్నాయని.. ఒకరికొకరం సహకరించుకుంటున్నామని.. ఇలాంటి పరిణామాలు ఆ మంచి వాతావరణాన్ని చెడగొడతాయని.. మహేష్ మీద ఈ కామెంట్స్ ఎంతమాత్రం సమంజసం కాదని.. నడిగర్ సంఘం మనోజ్ మీద కచ్చితంగా చర్యలు చేపట్టాలని అందులో పేర్కొన్నారు. కొంచెం హెచ్చరిక తరహాలోనే ఉంది ఈ లేఖ. నడిగర్ సంఘం ఈ లేఖ విషయంలో కచ్చితంగా స్పందించి మనోజ్ మీద చర్యలు చేపట్టక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. మనోజ్ ఇప్పటికే క్షమాపణ చెబుతూ సుదీర్ఘంగా ఒక లేఖ రాసినప్పటికీ మహేష్ ఫ్యాన్స్ శాంతించలేదు. ఆ లేఖలోనూ అతను యాటిట్యూడ్ చూపించాడని.. అందులో పేర్కొన్నట్లు అతను కేవలం ‘స్పైడర్’ గురించి మాత్రమే మాట్లాడలేదని.. హద్దులు దాటి ప్రవర్తించాడని.. కాబట్టి అతను తర్వాతి షోలో బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే అని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ‘మా’ కూడా ఈ విషయమై సీరియస్‌గా స్పందించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English