సమంత సినిమా... మార్నింగ్ షో ముగియకముందే

సమంత సినిమా... మార్నింగ్ షో ముగియకముందే

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు సూపర్ హ్యాపీగా ఉంది. ఆమె తొలిసారిగా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘యు టర్న్’ ఇటు తెలుగులో, అటు తమిళంలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీనికి ఓపెనింగ్స్ కూడా బాగున్నాయి.

మరోవైపు తమిళంలో సమంత నటించిన ‘సీమ రాజా’ సైతం వినాయక చవితి కానుకగా ‘యు టర్న్’తో పాటే రిలీజైంది. దానికి కొంచెం డివైడ్ టాక్ వచ్చినా.. కలెక్షన్లకు మాత్రం ఢోకా లేదు. తొలి రోజు ఏకంగా రూ.11 కోట్ల గ్రాస్ రాబట్టి తమిళనాట ఈ చిత్రం. మరోవైపు సమంత భర్త నటించిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ సైతం తెలుగులో బాగానే ఆడుతోంది. దీంతో సమంత ఆనందానికి అవధుల్లేవు. కానీ ఆమె ఆనందాన్ని తగ్గించే పరిణామాలు చోటు చేసుకున్నాయి.

తమిళంలో ‘యు టర్న్’తో పాటు ‘సీమ రాజా’ పైరసీ వెర్షన్లు తొలి రోజే ఆన్ లైన్లోకి వచ్చేశాయి. ‘యు టర్న్’ అయితే మార్నింగ్ షోలు ముగియడానికి ముందే పైరసీ వెబ్ సైట్ ‘తమిళ రాకర్స్’లో ప్రత్యక్షమైంది. ‘సీమ రాజా’ సైతం సాయంత్రం లోపే ఆన్ లైన్లోకి వచ్చేసింది. తమిళంలో పైరసీ భూతం విశృంఖల స్థాయిలో ఉంది. నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ ఆ మధ్యలో పైరసీని ఆపడానికి గట్టి ప్రయత్నమే చేశాడు.

అయితే కొంత కాలం కొంచెం వెనక్కి తగ్గిన పైరసీ వెబ్ సైట్లు తర్వాత మళ్లీ షరా మామూలే అనిపిస్తున్నాయి. కొత్త సినిమాలు విడుదలైన వెంటనే ఆన్ లైన్లో పెట్టేస్తున్నాయి. ఇందుకోసం రకరకాల మార్గాలు చూసుకుంటున్నాయి. ఎప్పుడూ అలవాటైన వెబ్ సైట్లలో కాకుండా వేరే వెబ్ సైట్లు తెరిచి.. తమ సబ్ స్క్రైబర్లకు మెయిల్ ద్వారా లింకులు పంపుతున్నాయి. ఇలా రకరకాల మార్గాల్లో పైరసీ వెర్షన్లు ఆన్ లైన్లోకి వచ్చేస్తుండటంతో నిర్మాతలకు ఏం చేయాలో పాలుపోవట్లేదు. ‘యు టర్న్’.. ‘సీమరాజా’ పైరసీని అడ్డుకునేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఇవి ఆన్ లైన్లో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English