రివ్యూలను జయించిన అల్లుడు?

రివ్యూలను జయించిన అల్లుడు?

ఈ రోజుల్లో కొత్త సినిమాలకు రివ్యూలు చాలా కీలకంగా మారిపోయాయి. సినిమాకు నెగెటివ్ రివ్యూలు వస్తే వెంటనే వసూళ్లు పడిపోతున్నాయి. కొన్ని చిత్రాలపై రివ్యూల ప్రభావం చాలానే ఉంటోంది. సాయంత్రానికే థియేటర్లు వెలవెలబోయే పరిస్థితి కనిపిస్తోంది.

ఈ విషయంలో ఇండస్ట్రీ జనాలు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ.. ప్రేక్షకులు ఒక సినిమా టాక్ తెలుసుకుని థియేటర్లకు వెళ్లాలనుకోవడంలో తప్పేమీ లేదు. సినిమా బాగుంటేనే చూడాలని వారు కోరుకోవడం సమంజసమే. కాబట్టి రివ్యూల ప్రాధాన్యం తగ్గట్లేదు. ఐతే అప్పుడప్పుడూ కొన్ని సినిమాల మీద రివ్యూల ప్రభావం కనిపించదు. రేటింగ్స్, టాక్‌తో సంబంధం లేకుండా అవి ఆడేస్తుంటాయి. ఇప్పుడు ‘శైలజారెడ్డి అల్లుడు’ ఆ జాబితాలోనే చేరేలా కనిపిస్తోంది.

ఈ చిత్రం తొలి రోజు డివైడ్ టాక్ తెచ్చుకుంది. సమీక్షకులెవ్వరూ దీనికి మంచి రేటింగ్స్ ఇవ్వలేదు. సినిమా మరీ పాత స్టయిల్లో ఉండటం.. కామెడీ అనుకున్న స్థాయిలో పండకపోవడం వాస్తవం. అయినప్పటికీ ఈ టాక్ సినిమా వసూళ్లపై ప్రభావం చూపించలేదు. తొలి రోజే ఏకంగా రూ.12 కోట్ల గ్రాస్.. రూ.7 కోట్ల దాకా షేర్ రాబట్టింది ఈ చిత్రం. ఐతే వినాయక చవితి సెలవు రోజు విడుదలైంది కాబట్టి వసూళ్లు బాగుండటంలో ఆశ్చర్యం లేదంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఐతే ఎంత సెలవైనప్పటికీ ఈ స్థాయి వసూళ్లు ఊహించలేదు. రివ్యూలు.. టాక్ బయటికి వచ్చాక థియేటర్ల దగ్గర సందడి తగ్గలేదు.

ఫస్ట్ షో, సెకండ్ షోలకు కూడా ఫుల్స్ పడ్డాయి. ఐతే రెండో రోజు వసూళ్లలో డ్రాప్ ఉంటుందని అనుకున్నారు. కానీ శుక్రవారం కూడా వసూళ్లు బాగున్నాయి. మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. ఫుల్స్ పడ్డాయి. వీకెండ్ కాబట్టి శని, ఆదివారాల్లోనూ సినిమా స్టడీగా నిలుస్తుందని భావిస్తున్నారు. సోమవారం పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటి వరకైతే పరిస్థితి ఆశాజనకంగా ఉంది. సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లేలాగే కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English