చైతూకు కోట్లు.. సమంతకు స్టార్లు

చైతూకు కోట్లు.. సమంతకు స్టార్లు

వినాయక చవితి వీకెండ్లో టాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడుతోంది. ఈ వారాంతంలో విడుదలైన రెండు చిత్రాలకూ మంచి ఫలితమే దక్కేలా ఉంది.

నిజానికి ఈ రెండు సినిమాల టాక్ భిన్నంగా ఉంది. మంచి అంచనాల మధ్య విడుదలైన ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రానికి నెగెటివ్ టాక్ వచ్చింది. ఈ చిత్రంలో ఏమాత్రం కొత్తదనం లేకపోవడంతో బ్యాడ్ టాక్ వచ్చింది. సమీక్షకులందరూ ఈ చిత్రంపై పెదవి విరిచారు. చాలా తక్కువ రేటింగ్స్ ఇచ్చారు.

కానీ ‘గీత గోవిందం’ తర్వాత థియేటర్లను కళకళలాడించే సినిమా ఏదీ పడకపోవడం.. కొంచెం పెద్ద స్థాయి సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుండటం.. పైగా చవితి సెలవు రోజు సినిమా రిలీజ్ కావడం దీనికి బాగా కలిసొచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఈ చిత్రం థియేటర్లకు బాగా ఆకర్షిస్తోంది. వాళ్లకు నచ్చే అంశాలు సినిమాలో ఉండటం కలిసొస్తోంది. తొలి రోజు ఈ చిత్ర వసూళ్లు అంచనాల్ని మించిపోయాయి.

‘శైలజారెడ్డి అల్లుడు’కి వచ్చిన టాక్ ప్రకారం చూస్తే రెండో రోజు వసూళ్లు బాగా పడిపోవాలి. కానీ రెండో రోజు కూడా ఈ చిత్రం నిలబడింది. మంచి వసూళ్లే రాబట్టింది. పరిస్థితి చూస్తుంటే వారాంతం అంతా ఈ సినిమా స్టడీగానే సాగేలా ఉంది. మంచి షేర్ సాధించేలా ఉంది. వీకెండ్ షేర్ రూ.15 కోట్లకు చేరువగా ఉండే అవకాశముంది. మరోవైపు ‘యూ టర్న్’ విషయానికి వస్తే.. ఈ చిత్రానికి సమీక్షకులు చాలా మంచి రేటింగ్స్ ఇచ్చారు.

తొలి రోజు తొలి రెండు షోలకు కలెక్షన్లు తక్కువగా ఉన్నాయి కానీ.. తర్వాత పాజిటివ్ టాక్‌తో సినిమా పుంజుకుంది. దాని స్థాయిలో అది మంచి వసూళ్లే రాబడుతోంది. ఫుల్ రన్లో ఈ చిత్రం బయ్యర్లకు మంచి లాభాలు తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు. మొత్తానికి భార్యాభర్తలైన నాగచైతన్య, సమంతలకు చవితి వారాంతం మంచి ఫలితాన్నే ఇచ్చిందని చెప్పాలి. అటు చైతూ సినిమాను కలెక్షన్ల వివరాలతో పబ్లిసిటీ చేస్తుంటే.. ఇటు సమంత చిత్రాన్ని రివ్యూ రేటింగ్స్‌తో ప్రచారం చేస్తుండటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English