హీరో కంటే హీరోయిన్‌కే గిరాకీ

హీరో కంటే హీరోయిన్‌కే గిరాకీ

విక్రమ్‌ సినిమాలు ఒక టైమ్‌లో పన్నెండు, పదిహేను కోట్ల రేంజిలో అమ్ముడయ్యేవి. కానీ తర్వాత వరుస ఫ్లాపులతో అతని మార్కెట్‌ బాగా పడిపోయింది. కొన్ని సినిమాలయితే అనువదించి కూడా విడుదల చేయకుండా వదిలేసారు. అతని సినిమాలిప్పుడు రెండు కోట్లు పలికినా ఎక్కువేనని ట్రేడ్‌ చెబుతోంది.

అంతగా డ్రాప్‌ అయిన తన మార్కెట్‌కి భిన్నంగా 'సామి' చిత్రం తెలుగు అనువాద హక్కులు మాత్రం ఎనిమిది కోట్లు పలికాయి. దీనికి విక్రమ్‌ కారణం కానే కాదు. ఇందులో హీరోయిన్‌గా నటించిన కీర్తి సురేష్‌ ఫ్యాక్టర్‌ బాగా దోహదపడింది. మహానటితో అమితంగా ఆకట్టుకున్న కీర్తి నటించిన తదుపరి చిత్రం కావడంతో దీనికి ఇంత రేటు పలికింది. మరో కారణం ఏమిటంటే దర్శకుడు హరి.
సింగం (యముడు) సిరీస్‌తో హరి చిత్రాలకి మాస్‌లో ఎంత ఫాలోయింగ్‌ వుందనేది స్పష్టమైంది. సింగం సిరీస్‌లో మూడవ సినిమా అంతగా ఆడకపోయినా కానీ 'సామి' కూడా సింగం ఛాయల్లోనే వుండడంతో ఇది కూడా మాస్‌కి కనక్ట్‌ అవుతుందని భావించడం వల్లే ఎనిమిది కోట్లు పలికింది.

ఈమధ్య తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అచ్చమైన మాస్‌ సినిమాలు రాకపోవడంతో వారంతా అలాంటి సినిమాల కోసం ఆబగా ఎదురు చూస్తున్నారు. మరి సామి వారి దాహం తీర్చే సినిమా అవుతుందా? విక్రమ్‌ కష్టాలు తీర్చి మళ్లీ హిట్టిస్తుందా అనేది వచ్చే వారం తెలుస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు