డియర్‌ శామ్‌.. నటించు కానీ మాట్లాడకు!

డియర్‌ శామ్‌.. నటించు కానీ మాట్లాడకు!

పరభాషా నటి ఇక్కడికి వచ్చి భాష నేర్చుకుని తన వాయిస్‌కి తనే డబ్బింగ్‌ చెప్పుకోవడం గొప్ప విషయం. ఖచ్చితంగా ఆమె ఎఫర్ట్స్‌కి, కృషికి ప్రశంసలు ఇవ్వాలి. అయితే అందరి గొంతులు వినసొంపుగా వుండవు. అందులోను ఒక డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ స్వరంతో విన్న వాయిస్‌ని మరోలా వినాలంటే ప్రేక్షకులకి కాస్త కష్టమే.

'యు టర్న్‌' చిత్రం కోసం స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకున్న సమంత ఆకట్టుకోలేకపోయింది. నటన పరంగా అద్భుతంగా అనిపించినా కానీ ఆమె వాయిస్‌ పలు సందర్భాల్లో బాగా ఇబ్బంది పెట్టిందనే కంప్లయింట్స్‌ వస్తున్నాయి. ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్స్‌లో ఏడుస్తూ మాట్లాడే సమయంలో ఆమె ఏమి చెబుతోందనేది కూడా అర్థం కావడం లేదని, చిన్మయి వాయిస్‌ తనకి అంత బాగా సూట్‌ అయినపుడు ఇపుడు బలవంతంగా తన గొంతుని రుద్దాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అసలే తన తెలుగులో తమిళ యాస వుంటుందేమో సమంత వాయిస్‌ని యాక్సెప్ట్‌ చేయడం కష్టమైన విషయమే. మహానటిలో నత్తి పాత్ర చేయడంతో పాటు ఎక్కువ మాటలు లేని క్యారెక్టర్‌ కావడం వల్ల ఆమె వాయిస్‌పై ఫిర్యాదులు రాలేదు కానీ యు టర్న్‌లాంటి చిత్రాలకి అన్నీ తానే అయి నడిపించాలి.

ఇలాంటి చోట్ల ప్రయోగాలకి పోకుండా వుండాలని అభిమానులే సూచిస్తున్నారు. ఈ ఫీడ్‌బ్యాక్‌ని తీసుకుని ఇకపై డబ్బింగ్‌ చెప్పే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటుందేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు