అరవింద సమేత రిజల్టుని బట్టి డిసైడ్‌ అవుతాట్ట

అరవింద సమేత రిజల్టుని బట్టి డిసైడ్‌ అవుతాట్ట

అరవింద సమేత షూటింగ్‌ పూర్తయ్యే దశకి రావడంతో త్రివిక్రమ్‌ చేసే మలి చిత్రం ఏమిటనే దానిపై ఆసక్తి నెలకొంది. పలువురు హీరోలతో కమిట్‌మెంట్లు వున్నాయి కానీ ఇంకా నెక్స్‌ట్‌ సినిమా ఎవరితో అనేది త్రివిక్రమ్‌ తేల్చుకోలేదు.

వెంకటేష్‌, మహేష్‌, అల్లు అర్జున్‌తో తలా ఒక చిత్రం చేయడానికి అయితే కమిటయ్యాడు. అరవింద సమేత రిజల్టుని బట్టి హీరోని పిక్‌ చేసుకుంటాడని సమాచారం. అరవింద సమేత కనుక ఆదరణ చూరగొంటే తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్‌తో చేస్తాడట.

అదే ఆ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వకపోతే తన స్టయిల్‌ మార్చేసి తక్కువ బడ్జెట్‌లో వెంకటేష్‌తో ఫ్యామిలీ సినిమా తీస్తాడట. మహేష్‌తో చేసే ఆలోచన వున్నా ప్రస్తుతానికి అతని డేట్లు లేవు కనుక బన్నీ లేదా వెంకీలో ఎవరో ఒకరితో సినిమా వుంటుందని అంటున్నారు. అలాగే త్రివిక్రమ్‌ వద్ద ఒక మల్టీస్టారర్‌ కథ కూడా రెడీగా వుందట.

అజ్ఞాతవాసి ఫలితంతో షేక్‌ అయిన త్రివిక్రమ్‌ అర్జంటుగా ఆ పరాభవం నుంచి బయట పడి తిరిగి తన వైభవం తెచ్చుకునేందుకు చూస్తున్నాడు. అరవింద సమేత తన ఇమేజ్‌ని, క్రేజ్‌ని రీస్టోర్‌ చేసేదీ లేనిదీ అనేదానిపై తదుపరి చిత్రాలు ప్లాన్‌ చేయాలని భావిస్తున్నాడు. తదుపరి చేసే మూడు చిత్రాలు కూడా హారిక హాసిని సంస్థకే కమిట్‌ అయ్యాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English