అండ్ ద విన్నర్ ఈజ్..

 అండ్ ద విన్నర్ ఈజ్..

వినాయక చవితికి దక్షిణాది బాక్సాఫీస్ హీటెక్కిపోయింది. ఇటు తెలుగులో.. అటు తమిళంలో ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. సమంత సినిమా ‘యూ టర్న్’ తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైతే.. దీనికి తోడుగా తెలుగులో ‘శైలజారెడ్డి అల్లుడు’.. తమిళంలో ‘సీమ రాజా’ లాంటి క్రేజీ చిత్రాలు రిలీజయ్యాయి. ఐతే ‘యూ టర్న్’ ఎంతైనా లేడీ ఓరియెంటెడ్ మూవీ.. పైగా ఒక వర్గం ప్రేక్షకులకే నచ్చే థ్రిల్లర్ సినిమా కావడంతో దానికి మరీ హైప్ ఏమీ లేదు.

కానీ ‘శైలజా రెడ్డి అల్లుడు’.. ‘సీమ రాజా’ చిత్రాలకు మాత్రం మంచి హైప్ వచ్చింది. పండగ సీజన్‌కు ఇవి పర్ఫెక్ట్ సినిమాలవుతాయని ప్రేక్షకులు ఆశించారు. కానీ ఈ రెండు సినిమాలూ అంచనాల్ని అందుకోలేకపోయాయి. ఇక్కడ ‘శైలజారెడ్డి అల్లుడు’.. అక్కడ ‘సీమ రాజా’ డివైడ్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ రెండు సినిమాల్లో కొత్తదనం లేదన్నది ప్రధానమైన కంప్లైంట్. పాత చింతకాయ పచ్చడి కథలతో ఈ చిత్రాల్ని రూపొందించారు. వినోదం కూడా ఆశించిన స్థాయిలో పండలేదు. రెంటికీ ఓపెనింగ్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ.. టాక్ మాత్రం బ్యాడే. వీకెండ్ తర్వాత ఈ సినిమాలు నిలవడం కష్టంగానే అనిపిస్తోంది.

ఐతే ‘యూ టర్న్’కు మాత్రం రెండు చోట్లా పాజిటివ్ టాక్ వచ్చింది. ఇటు విమర్శకులు.. అటు ప్రేక్షకులు ఈ సినిమాను పొగుడుతున్నారు. పర్ఫెక్ట్ థ్రిల్లర్ అంటున్నారు. ఉదయం ఈ చిత్రం డల్లుగా మొదలైనప్పటికీ తర్వాత మౌత్ టాక్ పాజిటివ్‌గా ఉండటంతో పుంజుకుంది. సాయంత్రానికి హౌస్ ఫుల్స్ పడ్డాయి. పాజిటివ్ టాక్ ఇంకా స్ప్రెడ్ అయితే సినిమా మంచి విజయం సాధించే అవకాశాలున్నాయి. మొత్తానికి భారీ అంచనాలున్న సినిమాలు నిరాశ పరిస్తే.. సమంత సినిమా సైలెంటుగా రేసులోకి దిగి విజేతగా నిలిచే పరిస్థితి కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు