రిలీజ్ చేసి 24 గంట‌లు కాలేదు.. 2.0 సంచ‌ల‌న రికార్డ్స్‌!

రిలీజ్ చేసి 24 గంట‌లు కాలేదు.. 2.0 సంచ‌ల‌న రికార్డ్స్‌!

రూ.540 కోట్ల‌తో ఒక సినిమా. అదీ భార‌తీయ సినిమా. అందునా సౌత్ మూవీ. వినేందుకే విచిత్రంగా ఉన్నా.. దీన్ని రియాలిటీ చేసిన ఘ‌న‌త సెన్సేష‌న‌ల్  క్రియేటివ్ ద‌ర్శ‌కుడు శంక‌ర్ కు మాత్ర‌మే చెల్లుతుంది. ఏళ్ల‌కు ఏళ్లుగా శిల్పాన్ని చెక్కిన చందంగా త‌న సినిమాల్ని రూపొందించ‌టం ఆయ‌న‌కు మాత్ర‌మే చెల్లుతుంది.

ఇప్ప‌టికే ప‌లుమార్లు రిలీజ్ డేట్ ను మార్చుకొని.. ఎప్ప‌టికి విడుద‌ల‌వుతుంద‌న్న సందేహంతో ఉన్న ప్రేక్ష‌కుల‌కు వినాయ‌క‌చ‌వితి పండుగ వేళ 2.0 టీజ‌ర్ ను విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. 1.29 నిమిషాల నిడివి ఉన్న ఈ టీజ‌ర్ ఇప్ప‌టికే సంచ‌ల‌నాల మీద సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది.

భారీ అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌ని రీతిలో విజువ‌ల్ ఫీస్ట్ గా మారిన ఈ మూవీకి నెటిజ‌న్లు జై కొడుతున్నారు. కేవ‌లం రోజు కంటే త‌క్కువ వ్య‌వ‌ధిలో (24 గంట‌లు అయ్యేందుకు మ‌రో మూడు గంట‌ల ముందుగా)  ఈ చిత్ర టీజ‌ర్ భారీ రికార్డ్స్ ను త‌న ఖాతాలో వేసుకుంది.

టీజ‌ర్ విడుద‌లైన త‌క్కువ వ్య‌వ‌ధిలోనే భారీ వ్యూస్ రాబ‌ట్టింది. హిందీ టీజ‌ర్ కు అత్య‌ధికంగా 10 మిలియ‌న్ మార్క్ (10.13 మిలియ‌న్లు.. కోటి వ్యూస్‌)ను అల‌వోక‌గా దాటేస్తే.. త‌మిళ్ లో ఈ టీజ‌ర్ కోటి (స‌రిగ్గా చెప్పాలంటే 92 ల‌క్ష‌లు) వ్యూస్ కు ద‌గ్గ‌రైంది.  ఇక‌.. తెలుగులో యాభై ల‌క్ష‌ల మార్క్ ను దాటేసింది. అంటే.. మూడు భాష‌ల్లో క‌లిసి ఏకంగా 2.5కోట్ల వ్యూస్ ను 24 గంట‌లు దాట‌క ముందే సొంతం చేసుకోవ‌టం ద్వారా అరుదైన రికార్డ్స్ ను త‌న ఖాతాలో వేసుకుంది. టీజ‌ర్ తోనే సంచ‌ల‌న రికార్డుల్ని సొంతం చేసుకుంటున్న రోబో2.0 విడుద‌ల‌య్యాక క‌లెక్ష‌న్ల‌లో మ‌రెన్ని సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు